పూర్వం ఎంత బిజీగా ఉన్నా సరే ఆహారం విషయంలో మాత్రం అలసత్వం ఉండేది కాదనే మాట వాస్తవం. ఎన్ని పనులు ఉన్నా సరే ఆహారాన్ని వాయిదా వేసే వాళ్ళు కాదు. కాని ఈ రోజుల్లో ఉదయం టిఫిన్ ని మధ్యాహ్నం మధ్యాహ్న భోజనాన్ని సాయంత్రం 4 గంటలకు, రాత్రి భోజనాన్ని అర్ధరాత్రి చేస్తున్నారు. డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని నాశనం చేసుకునే పరిస్థితి నెలకొంది.
Also Read:గట్టి పెరుగు రావాలంటే ఏం చేయాలి…? గిన్నె ఫ్రిడ్జ్ మీద పెడితే ఫలితం ఉంటుందా…?
ఇక మనం సరైన సమయానికి భోజనం చేయకపోతే కచ్చితంగా తల నొప్పి వస్తుంది. అసలు తల నొప్పికి కారణం ఏంటో చూద్దాం. శరీరం అసౌకర్యానికి గురి అయిన సందర్భంలో… శరీరం నుంచి మనకు ఏదోక రూపంలో సంకేతాలు వస్తాయి. మనం సరైన సమయానికి ఆహరం తీసుకోకపోయినా లేదంటే… తగినంత నీటిని తీసుకోకపోయినా శరీరానికి శక్తీ అందే అవకాశం ఉండదు.
మన శరీరం లో మెదడు నిరంతరాయం గా పని చేస్తూ ఉంటుంది కాబట్టి… అన్నిటికంటే ఎక్కువ ఆక్సిజెన్ ను, శక్తిని మెదడుకి అందించాలి. మనం ఎప్పుడైతే నీటిని, ఆహారాన్ని తీసుకోకుండా గంటల తరబడి పని చేస్తామో… అక్కడి నుంచి మెదడుకు అందే ఆక్సిజెన్, శక్తి తగ్గుతూ ఉంటాయి. ఇక దాని ఫలితమే తలనొప్పి. చిన్న చిన్న గా తలనొప్పి వచ్చినప్పుడు ఎక్కువ మొత్తం లో నీటిని తాగుతూ ఉండటం మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొంచెం కొంచెం గా ఆహారం తీసుకోవడం కూడా మంచి ఫలితం ఉండవచ్చు.
Also Read:క్యాసినో నిర్వహించా.. తప్పేంటి? : చికోటి