మన దేశంలో మినహాయిస్తే చాలా దేశాల్లో గోల్ఫ్ ఆటకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. డబ్బున్న వాళ్ళు, పేదలు అనే తేడా లేకుండా ఆ ఆటను ఇష్టపడుతూ ఉంటారు. ఇక డబ్బున్న వాళ్ళు మన దేశంలో సైతం దాని మీద ఆసక్తి చూపిస్తూ ప్రతీ రోజు ఆడుతూ ఉంటారు. ఇక విదేశీ వ్యాపారవేత్తలు గోల్ఫ్ కోర్స్ ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు.
Also Read:మాజీ సీఎం సంచలన నిర్ణయం…!
ఇక గోల్ఫ్ ఆటలో ఉండే ఒక చిన్న ఆసక్తి ఏంటి అంటే… అందులో వాడే బంతికి సొట్టలు ఉంటాయి. మాములుగా క్రికెట్ బంతులకు సొట్టలు ఉండవు. ఎందుకు ఉంటాయి అనేది ఒకసారి చూస్తే… మొదట్లో సొట్టలు లేకుండా నున్నని బంతినే వాడారు. అయితే ఆ బంతి వేగం చాలా తక్కువగా ఉండేది. సొట్టలు ఉన్న బంతిని ఉపయోగించిన తర్వాత బంతి వేగం పెరిగింది. సొట్టలున్న బంతులు దూరం కూడా వెళ్తాయి అని గుర్తించారు.
ఒక బంతి కి, సగటున 300 నుంచి 500 వరకు సొట్టలు ఉంటాయట. ఈ సొట్ట సగటున 0.001 అంగుళం లోతు ఉంటుంది. ఇక లోతు మారితే గనుక అది పోయే కోణం ,అలాగే దూరం ని ప్రభావితం చేస్తుందని వెల్లడి అయింది. ఈ సొట్టలు కూడా వలయాకారంలో ఉంటాయి. అయితే హెచ్ఎక్స్ అనే బ్రాండ్ బంతి మాత్రం షడ్భుజి ఆకారపు సొట్టలతో ఉంటుంది. గుండ్రంగా నున్నగా ఉండే బంతి పై, గాలి వల్ల నిరోధం పని చేసి అది వెళ్ళే దూరం తగ్గుతుంది. సొట్టలు ఉంటె గాలి నిరోధాన్ని తట్టుకుని విమానం రెక్కల మాదిరిగా ఆ సొట్టలు ఉపయోగపడి బంతి పైకి లేవడానికి సహకరిస్తాయి.
Also Read:గులాబీ రంగులో మెరిసిన ఆకాశం!!