ఆ సీన్ చూస్తే గూస్ బుంప్స్ రా, నేను ఆ వార్త విన్నప్పుడు అయితే గూస్ బంప్స్ మామ… ఇలా మనం ఏదోక సందర్భంలో రోమాలు నిక్కబోడుచు కోవడం గురించి వింటూనే ఉంటాం కదా… అసలు గూస్ బంప్స్ అంటే ఏంటీ…? గూస్ బంప్స్ మనకు ఎందుకు వస్తాయి అనేది చాలా మందికి అవగాహన లేదు. అసలు ఆ విధంగా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
మనం ఊహించని సంఘటనలు జరిగినప్పుడు గాని వాతావరణంలో మార్పులతో అంటే చలి వంటివి ఎక్కువగా కలిగినప్పుడు గాని సంభ్రమానికీ, ఆశ్చర్యానికీ, భయానికి లోనైనప్పుడు గూస్ బంప్స్ అనేవి కలుగుతాయి. మన మెదడులో కణాలు బయట జరిగిన విషయానికి షాక్ కు గురైనప్పుడు ఈ పరిణామం జరుగుతుంది. మన మెదడు మన శరీరాన్ని ఒక్క ఉదుటున అప్రమత్తం చేస్తూ ఉంటుంది.
అప్పుడు రక్తం వేగం పెరిగి చర్మం కండరాలు బిగుసుకుంటాయి. చర్మము కండరాలు బిగుసుకునే ఆ ప్రభావంతో వెంట్రుక కుదుర్లు బిగుసుకు పోవడం వల్ల వెంట్రుకలు నిక్క పొడుస్తాయన్నమాట. ఏదైనా ఊహించని హఠాత్ పరిణామం లేదంటే మనకు బాగా ఆశ్చర్యంగా అనిపించినప్పుడు ఇలా జరుగుతుంది. షాక్ ను తట్టుకోవడానికి మన మెదడు శరీరాన్ని సిద్దం చేస్తుంది. ఆ ఆదేశాలతోనే ఈ విధంగా జరుగుతుంది.