మనకు నిత్యం కనపడే జంతువులలో కొన్ని జంతువుల పనులు, అవి చేసే అల్లరి మనకు బాగా నచ్చుతూ ఉంటాయి. అందులో కుక్కలు మొదటి వరుసలో ఉంటే తర్వాత పిల్లులు, కోతులు ఉంటాయి. కోతి ఏ పని చేసినా మనకు వింతగానూ విడ్డూరంగాను ఉంటుంది అనే మాట వాస్తవం. కోతి దూకడం, పేలు చూసుకోవడం సహా మరికొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. అసలు అవి పేలు ఎందుకు చూసుకుంటాయి…? దొరికిన పేలను అవి ఎందుకు తింటాయి…?
Also Read : కుక్కకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎందుకు నచ్చదు…?
మనం చాలాసార్లు కోతులను గమనిస్తే కోతులు తమ పిల్లలకో, లేదా పక్కన ఉన్న మరో కోతికో జాగ్రత్తగా కూర్చుని పేలు చూస్తాయి. అవి దొరికిన వెంటనే నోట్లో వేలు వేసుకుని చప్పరించడం మనం గమనిస్తాం. కొన్ని పెంపుడు కోతులు సైతం అదే విధంగా చేస్తాయి. తమను పెంచే వారి తలలో కూడా అవి పేలు వెతుకుతూనే ఉంటాయి. ఇది చూడటానికి ముచ్చటగా ఉంటుంది. కాని కోతులను ఎక్కడ చూసినా సరే అలాగే చేస్తూ ఉంటాయి.
దీనితో శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అవి వెతుక్కునేది పేలు కోసం కాదు. ఎండిపోయిన చర్మపు పొలుసు కోసం వెతుక్కుంటాయి. చర్మలో నుంచి ఊరి వచ్చే ఉప్పు పలుకుల కోసం. అలాంటి పొలుసులును ఏరి నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల వాటికి ఒకరకమైన తృప్తి కలుగుతుంది. ఆ విధంగా వెతుక్కునే క్రమంలో ఏవైనా పేలు, పురుగులు వంటి జీవాలు వచ్చినా చప్పరించడానికి వాటికి ఏ విధమైన అభ్యంతరాలు ఉండవు.
Also Read: చిరంజీవి తండ్రి నటించిన సూపర్ హిట్ సినిమా ఏదో తెలుసా ?