మతానికి ఒక సాంప్రదాయం కులానికి ఒక ఆచారం ఉంటుంది. వారి వారి సాంప్రదాయాలను ఆచారాలను కచ్చితంగా పాటిస్తారు చాలా మంది. హిందు, ముస్లిం, సిఖ్, క్రైస్తవులు ఇలా ప్రతీ ఒక్కరు తమ మతానికి తగ్గట్టుగా కట్టుబొట్టు ఉంటుంది. అలాంటి ఒక సంప్రదాయమే ముస్లింలు తలపై క్యాప్ ధరించడం. అసలు ఆ క్యాప్ ను ఎందుకు ధరిస్తారో చూద్దాం.
Also Read:కారు బోరుకొస్తోందా?
మహా ప్రవక్తపై అమితమైన ప్రేమ ముస్లిం సమాజంలో ఉంటుంది. ప్రవక్త మార్గదర్శకత్వం చేసి, ఋజుమార్గంలో ప్రయాణించేలా చేసిన వ్యక్తి ప్రవక్త. దీనితో ప్రవక్తపై విధేయతా, భక్తిభావాలు ఎక్కువ. ఆయన ఏ విధంగా జీవించారు, ఏమేం చేసేవారు అనే అంశాలపై అందరికీ వారిలో ఆసక్తి ఉంటుంది. ఆయన అమలుపరిచినవి అన్నీ అమలులోకి తేవటానికి నిత్యం కష్టపడుతూ వాటిని అలవాటు చేసుకుంటారు.
అలాంటి ఒక కార్యక్రమమే… అందులో ఒకటి- తల వెంట్రుకలు కనబడకుండా అమామా (టర్బన్ క్లాత్) ధరించటం. అమామా లోపల టోపీ ధరిస్తారు. దాన్ని తకియా అంటారు. కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి. అయితే నేటి తరాలు సంప్రదాయానికి దూరం జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉంటూ తమ దేవుని పట్ల, దైవ ప్రవక్త పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన వారిగా ఉంటారు. తమ సాంప్రదాయంగా భావించే అమామాను, తకియాను ధరిస్తారు. ఆయన ఏం చేసినా సరే దాన్ని అమలు పరచడమే వారి సాంప్రదాయం. ఇక ముస్లిం సమాజంలో సాంప్రదాయం పాటించే వారిని సున్నీలు అంటారు.
Also Read:నీటి ఘటనలో కోలుకోని బాధితులు..