ఈ రోజుల్లో చాలా మందికి అరికాళ్ళ మంటలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే అరికాళ్ళ నొప్పుల సమస్య కూడా చాలా మందిలో ఉంది. అసలు అరికాళ్ళ మంటలు ఎందుకు వస్తున్నాయి…? వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి…? విటమిన్ల లోపం, పాదరక్షలు లేకుండా బండలూ, గులక నేలమీద నడవడం దీనికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెప్తున్నారు.
Also Read:పాశ్చరైజ్డ్ పాలు అంటే ఏంటీ…? మన ఇంట్లో అలా సాధ్యమేనా…?
మధుమేహ వ్యాధి ముదిరినపుడు పాదాలు, అర చేతులలో స్ప ర్శను గ్రహించే నరాలు చాలా సెన్సిటివ్ గా తయారై మంటలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విటమిన్ బీ 12 లోపం వల్ల, వెరికోస్ సిరల వల్లా కూడా అరికాళ్ళలో మంటలు వస్తాయి. ఇక చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటీ అంటే… అరుదుగా డయాబెటిస్ వ్యాధి లేని వారికి కూడా పెద్ద వయసులో మంటలు వచ్చే అవకాశం ఉంది. దీనికి కొన్ని రకాల పరిష్కారాలు ఉన్నా సరే అవి చాలా మంది ఫాలో అవ్వడం లేదు.
అడుగు చాలా మెత్తగా ఉండే షూస్ ధరించడం దీనికి పరిష్కారం. షూస్ లోపల మెత్తటి మెటీరియల్ తో చేసిన సపోర్టు లను పెట్టి షూస్ వేసుకోడం వంటి చర్యలవల్ల బాధ నివారణ కాస్త తగ్గుతుంది. పాదాల మంట తీవ్రం కావడంతో కొందరు కేప్స్యూల్సు, పాదలేపనాలు వంటివి వాడుతున్నారు. అయితే వీటికి సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకుని వైద్యులు చెప్పినవి పాటించడం మంచిది.
Also Read:పోడు పోరు.. గిరిజనులపై అధికారి దాడి!