చమురు శుద్ధి కర్మాగారాల విషయంలో యాజమాన్యాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ప్రతీ విషయాన్ని అత్యంత సున్నితంగా తీసుకుంటారు. ఇక ఇందులో కొందరికి కొన్ని సందేహాలు ఉన్నాయి. చమురు ఫ్యాక్టరీల పైన ఎప్పుడు మంట వెలుగుతూ ఉంటుంది. చమురు శుద్ధి కర్మాగారాలలో ముడి చమురును శుద్ధి చేసి పెట్రోలు, డీజెల్ వంటి ఉత్పత్తులను వేరు చేసే ప్రక్రియలో మీథేన్, ఈథేన్ వంటి కొన్ని తేలికపాటి వాయువులు బయటకు వస్తాయి.
Also Read:ఆర్మీ చీఫ్ వెనుక దాక్కోవడం మానండి…. !
అయితే ఈ వాయువులు ఇంధనంగా ఉపయోగపడతాయి గానీ, ఆ కొద్దిపాటి వాయువులని పట్టుకుని వాటిని నిల్వ చేయడం, ఆ తర్వాత సరఫరా చేసి విక్రయించడం ఆర్ధికంగా నష్టం చేకూరుస్తుంది. కనుక ఆ వాయువులను ఫ్లేరింగ్ టవర్ ద్వారా పైకి పంపి మండిస్తారు. ఆ విధంగా మండిన సమయంలో… ఆ వాయువులు కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి రూపాల్లోకి మారి గాలిలో కలిసిపోతాయి.
అందుకే ప్రతి రిఫైనరీలోనూ ‘ఫ్లేర్’ అవుతున్న వాయువుల తాలూకు మంట వెలుగుతూ మనకు కనిపిస్తుంది. ఇక కొందరికి ఉండే సందేహం… మిథేన్, ఈదెన్ వాయువులను మండించి గ్లోబల్ వార్మింగ్ కి కారణం అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ నీ వాతావరణం లోకి పంపడం ఎందుకు అని… మీథేన్ ఇంకా ఈదేన్ లాంటి తేలికపాటి వాయువులు కదా అలాగే వదిలితే వచ్చే సమస్య ఏంటీ అని. అయితే మీథేన్, ఈథేన్ మాత్రమే కాక కార్బన్ మోనాక్సయిడ్ వంటి విషవాయువులు కూడా ఉండే అవకాశం ఉంది. వాటిని యథాతథంగా వాతావరణంలోకి వదిలితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే వాటిని మండించడం అనేది తప్పనిసరి.
Also Read:వీసా ఉంటేనే రష్యాలో ఎంట్రీ..!