అంతర్జాతీయ క్రికెట్ లో బంతితో జరిగే గాయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. బాల్ బలంగా తగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో బంతితో దెబ్బలు తగలకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏంటీ అనే దాని మీద ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. తలకు బలమైన గాయాలు తగలకుండా ఇప్పుడు హెల్మెట్ లో కూడా మార్పులు చేస్తున్నారు.
Also Read:బెయిల్ కు పెరోల్ కు మధ్య తేడా ఏంటీ…?
ఇక గాయాల భయం ఎక్కువగా ఉన్న బ్యాట్స్మెన్ లు అయితే… రక్షణ కవచాలు ఎక్కువగా పెట్టుకుని క్రీజ్ లోకి వస్తారు. మన సచిన్ లాంటి ఆటగాళ్ళు అన్న మాట. ఇక క్రికెట్ లో బాల్ పట్టుకునే సమయంలో చేతులను ఎందుకు వెనక్కు లాగుతారు అనే సందేహం చాలా మందిలో ఉంది. బంతి చేతిలోంచి రిబౌండ్ అవ్వకుండా అంటే… బాల్ స్పీడ్ గా వస్తుంది మనం చేతులను వెనక్కు లాగాకపోతే అది చేతిలో పడి వెనక్కు వెళ్తుంది.
వెనక్కు అంటే మళ్ళీ విసిరిన వాళ్ళ దగ్గరకు కాదు చేతిలో నుంచి జారిపోతుంది. చేతులను వెనక్కు లాగడం ద్వారా బంతి వేగాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కదిలే బస్ నుంచి దిగినప్పుడు కొంత దూరం పరిగెత్తకపోతే ఏం జరుగుతుంది…? ముందుకు పడతాం కదా… ఇది కూడా అంతే. ఇక అరిచేతులకు దెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. బంతి గట్టిగా ఉంటుంది కాబట్టి అది వచ్చే వేగానికి తగిలితే సినిమా కనపడుతుంది.
Also Read:మరో టైటిల్ వేటలో భారత షట్లర్లు.. సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి