మిలటరీ వాళ్ళు ఎక్కువగా వాడే బండి బులెట్ లేదా రాజ్ ధూత్… ఈ రెండు కాకుండా వాళ్ళు మరో బండి వాడటానికి ఇష్టపడరు. రాయల్ ఎన్ ఫీల్డ్ లో బులెట్ తరహా బండ్లు అన్నీ వాడుతూ ఉంటారు. ఇప్పుడు రాజ్ ధూత్ బళ్ళు పెద్దగా కనపడవు. అసలు వాళ్ళు ఆ బండి ఎందుకు వాడతారు అనేది చాలా మందికి స్పష్టత లేదు. ఒక్కసారి వాళ్ళు ఎందుకు ఆ బండ్లు వాడతారో చూద్దాం.
Also Read: నీలోఫర్ ఆస్పత్రికి ఆ పేరెలా వచ్చింది…? ఆ ఆస్పత్రి కట్టించింది ఒక అందగత్తెనా…?
ఎక్కువగా రిపబ్లిక్ పెరేడ్, స్వంతంత్ర దినోత్సవ వేడుకలలో మోటార్ సైకిల్ విన్యాసాలు మనం చూస్తూ ఉంటాం. సైనిక దళాలలో, పారా మిలిటరీ విభాగాలలో కొంతమంది సైనికులు బులెట్ మోటార్ సైకిల్స్ పై విన్యాసాలను ఎక్కువగా బులెట్ తోనే చేస్తూ ఉంటారు. అసలు ఆర్మీలో వాటి చరిత్ర ఒక్కసారి చూస్తే… రెండవ ప్రపంచ యుద్ధము లో ఈ వాహనాలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
స్వాతంత్ర్యం తర్వాత ఈ బళ్ల అవసరం ఇండియన్ ఆర్మీకి బాగా వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లాంటి సరిహద్దు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా వాడాల్సి వచ్చింది. సరిహద్దులు కొండ ప్రాంతాలు కాబట్టి ఆర్మీ కి వీటిని ఎక్కువగా ఇచ్చారు. దేశ సరిహద్దులలో, కొండ ప్రాంతాల్లో మిలటరీ వాళ్ళు చేరుకోవాలి అంటే ఇవి బాగా సహకరించేవి. పెద్ద పెద్ద వాహనాలతో వెళ్ళలేని ప్రాంతాల్లో ఆర్మీ వీటితో చాలా సులువుగా వెళ్ళేది.
ఇక వీటి తయారి కూడా ఆర్మీని ప్రమాదాల నుంచి కాపాడింది. బండి పడినా సరే పెద్ద పెద్ద గాయాలు అయ్యేవి కాదు. బంపర్ నిర్మాణం కూడా కాస్త బలంగా ఉంటుంది. బండి బరువుగా ఉండటంతో అదుపులో ఉండేది. ఇక దీనికి పక్కన ఉండే ఒక బాక్స్ కూడా ఆర్మీ వాళ్లకు ఆహార, ఆయుధ పదార్ధాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడింది. వెహికల్స్ మైంటెనెన్స్ కూడా కాస్త సులువు అనే చెప్పాలి. ఎంత డ్రైవ్ చేసినా సరే అలుపు రాదు. అందుకే హిమాలయాల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఈ బళ్ల మీదనే వెళ్ళడానికి ఇష్టపడతారు. మీరు గమనిస్తే… బుల్లెట్ ల మీద ప్రమాదాలు చాలా తక్కువ. ఇక ఆర్మీ వాళ్ళు ఆ బండి వాడటాన్ని గౌరవంగా కూడా భావిస్తారు.
Advertisements
Also Read: పుష్ప రిలీజ్ డేట్ లాక్ చేసిన సుకుమార్