పోలీసుల చర్యలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. నేరం చేసిన వారిని గుర్తించే పద్ధతి, కేసు నమోదు చేసే పద్ధతి, కస్టడీ విధానాలు, వాటికి అనుసరించే రూల్స్ ఇలా ఎన్నో ఆసక్తికరంగా ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కొంతైనా ఉన్నప్పటికీ మనం మాత్రం ఆసక్తి చూపించడం లేదనేది వాస్తవం. పోలీసులు మనల్ని ఇబ్బంది పెట్టినా సహకరించకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల గురించి అవగాహన ఉంటే మనకు మంచిది.
అలాంటిదే ఒకటి… ఎవరిని అయినా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టిన సమయంలో నిందితులకు ముసుగు వేస్తారు. అసలు అలా ఎందుకు చేస్తారు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. పోలీసులు పట్టుకున్న ప్రతి వ్యక్తి నేరస్థులు కాదు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి నేరం చేసాడా లేదా అని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయవాదులు వాదోపవాదాలు జరిపిన తరువాత ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరుగుతుంది.
అప్పుడు మాత్రమే అతను నిందుతుడు అని సమాజానికి తెలియజేసే బాధ్యత పోలీసులకు ఉంటుంది. అప్పటి వరకు సమాజానికి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిని పోలీసులు దొంగ తనం చేసాడు అని పట్టుకుని ప్రజల ముందు ఆ వ్యక్తిని చూపించి ఆ తర్వాత కోర్ట్ కు తీసుకువెళ్ళి హాజరు పరిచి కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ వ్యక్తి నిర్దోషి అని కోర్టు తీర్పు ఇస్తే.. అతని పరువు పోతుంది. ఏమైనా చేసుకుంటే దానికి పోలీసులే బాధ్యత వహించాలి. అందుకనే ముసుగు వేసి జాగ్రత్త పడతారు.