పోలీసులు కాకీ దుస్తులు ఎందుకు ధరిస్తారు అనేది ఆసక్తికర విషయం. దీని గురించి మనం పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు గాని… అది ఆసక్తికరమే. మొదట్లో పోలీసులు లేదా రక్షక బటులు వేరు వేరు రంగు బట్టలే ధరించే వారు. ఆయా రాజ్యానికి తగిన విధంగా వస్త్రాలు ధరించే వారు. అయితే బ్రిటీషు వారి కాలంలో మాత్రం మనం బానిసలైన తర్వాత మన చేతి వృత్తులని నాశనం చేసి వారి మిల్స్ నుండి వచ్చిన వస్త్రాలను తక్కువ ధరకు విక్రయించే వారు.
ఎక్కువగా తెలుపు రంగే ఉండేది. అలాగే రక్షక భటుల యూనిఫారం కూడా తెలుపు రంగుగా ఉండేది. బ్రిటీషు వారి రాజధాని కలకత్తాగా ఉండేది. అక్కడి పోలీసులు తెలుపు రంగు యూనీఫారమే ధరించే వారు. అయితే అవి ఈజీగా మలినం అయ్యేవి , దుమ్ము ధూళీ ,బురద వల్లా ఇబ్బంది ఉండేది. అందుకే వారు అందరూ కాస్త ఐవరీ లేదా క్రీమ్ కలర్ లో వారి యూనిఫారం ఉండేలా చూసుకునే వారు. అంటే వాటిని డై చేసుకునే వారు.
వాటిని డై వేయడానికి గాను కాఫీ డికాషన్ ను నీలి మందును ఎక్కువగా ఉపయోగించే వారు. ఈ విధంగా డికాషన్ వాడడం వల్ల అందరి యూనిఫార్మ్ లూ ఒకో ఛాయలో ఉండడం బ్రిటీషు అధికారులకు ఏ మాత్రం నచ్చలేదు. అందుకే మొత్తానికి ముదురు ఖాకీ రంగులోకి డై వేసుకోమని చెప్పారు. ఆ విధంగా కలకత్తా రూరల్ లో మొదలైన ఈ సాంప్రదాయం మెల్లగా దేశం మొత్తం విస్తరించింది. అయితే కలకత్తాలో మాత్రం ఇప్పటికి కూడా తెలుపు దుస్తులనే పోలీసులు ధరిస్తారు.