మన దేశంలో భక్తికి ఉన్న విలువ మరే అంశానికి లేదు అనేది వాస్తవం. భక్తి విషయంలో ప్రాణం తీయడానికి అయినా ప్రాణం పోయడానికి అయినా సరే భారతీయులు సిద్దంగా ఉంటారు. అందులో ముఖ్యంగా కానుకలు సమర్పించే విషయంలో వెనుకా ముందు ఆలోచించే పరిస్థితి ఉండదు. హుండీలో కానుకలతో పాటుగా నదిలో రూపాయి బిళ్ళలు వేస్తూ ఉంటారు కొందరు. అసలు నదిలో డబ్బులు ఎందుకు వేస్తారో చూద్దాం.
దాని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి ఆహారాన్ని ఎక్కువగా రాగి పాత్రల్లో తినాలి, నీరు ఎక్కువగా రాగి వస్తువులతో తాగాలి అంటారు. అందుకే గుడిలో తీర్ధం ఇచ్చే గిన్నె, స్పూన్ కూడా రాగివే అయి ఉంటాయి. రాగి కి సహజంగా నీటికి శుద్ది చేసి గుణం ఎక్కువ. పూర్వం ఎక్కువగా నదులలోని నీళ్ళను తాగే వాళ్ళు. అందుకే ఆ నీరు శుద్దిగా ఉండాలి అని పెద్దలు నమ్మే వారు.
కాబట్టి ఆ నీరు శుద్దిగా మారడానికి నదుల్లో రాగి నాణాలు వేయడం జరిగేది. ఆ రాగి కొంత కరిగి శరీరంలోకి వెళ్తుంది అని అది ఆరోగ్యానికి మంచిది అని బలమైన నమ్మకం. రాగి బంగారం వంటివి ఆరోగ్యానికి మంచిది అని అప్పట్లో అలా వేసేవాళ్ళు. ఇదంతా అర్ధం కాదు కాబట్టి డబ్బులు నదిలో వేస్తే పుణ్యం అని చెప్పే వాళ్ళు. అయితే ఇప్పుడు నదిలో ఏవి పడితే అవి వేసి నదులను నాశనం చేస్తున్నారు.
ఇప్పుడు స్టీల్ నాణాలు కాబట్టి వేయకుండా ఉండటమే మంచిది. ఇక మరో కారణం… మన దేశంలో పశువులను, చెట్లను రాళ్ళను, నదులను దైవ స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు. అలా నదిలో నాణం వేస్తే గంగాదేవికి సమర్పించినట్టే అని ఒక బలమైన నమ్మకం ఉండేది అప్పట్లో. ఇక నదిలో వేసిన నాణాలను వేరుకుని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. స్టీల్ నాణాలు వేస్తే నదుల్లో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది. అవి తుప్పు పట్టి నీళ్ళను నాశనం చేస్తాయి. అయినా నదుల్లో నీళ్ళు ఎన్నో రకాలుగా నాశనం చేస్తూనే ఉన్నారు.
Advertisements
Also Read: బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఏ ఫ్రూట్స్ తినడం మంచిది…?