ఈ సృష్టిలో ఏ ప్రాణికి అయినా కన్ను అత్యంత విలువైన అవయవం. కన్ను లేకపోతే మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే నేత్రదానంకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక మన కంటికి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చదివే సమయంలో, ఫోన్ నొక్కే సమయంలో, కంప్యూటర్ ముందు, ఏదైనా పని చేసే సమయంలో, ప్రయాణం సమయంలో కంటికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
also read: కుక్కపిల్ల కన్నా.. తల్లే ముద్దుగా ఉంది..!
రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడటం ఉత్తమం. ఇక కంప్యూటర్ ముందు పని చేస్తుంటే… రెప్ప వేయకుండా పని చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. పని చేసే సమయంలో తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. ఇక కంటిన్యూగా పని చేయకుండా మధ్యలో విరామం ఇస్తూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్ తీసుకుని కంప్యూటర్ ని మాత్రమే కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడటం మంచిది.
నీ పని నువ్ చేయ్.. నా పని నేను చేస్తా..!
ఇక టీవీ చూసే సమయంలో మనకు టీ.వీ.కి కనీసము 3 మీటర్లు దూరం ఉండాల్సి ఉంటుంది. ఇక కంటి రెప్పలు ఎందుకు వేస్తామంటే… రెప్ప ఆర్పడం వల్ల కళ్లలో పడిన దుమ్ము కళ్ళ దగ్గర ఉన్న నీరు తీసుకొని కంటిని శుభ్రం చేస్తాయి. రెప్ప ఆర్పడం అనేది మన ఆధీనంలోనే ఉన్నా సరే మనకు తెలియకుండా రెప్ప ఆర్పుతాం. ఒక నిమిషం లో 10 నుండి 20 సార్లు రెప్పలు ఆర్పుతాం. ఇక మనం చదివే సమయంలో ఒక వాక్యం పూర్తి అయిన తర్వాతనే రెప్పలు ఆర్పుతాం. దీనిని మెంటల్ బ్రేక్ అని పిలుస్తారు. ఇక మన కంట్లో తేమ శాతం తగ్గి కళ్ళు మండుతూ ఉంటాయి. అప్పుడు రెప్ప వేయకపోతే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి.