అతడు” మహేష్ బాబు కెరీర్ లో ఒక రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చిన సినిమాల్లో ఒకటి. సినిమాలో ప్రతీ పార్ట్ కూడా అందంగా ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదలై ఎన్నేళ్ళు అయినా సరే టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా అంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో చూద్దాం.
ఈ సినిమా ఎక్కడి నుంచి చూసినా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా ఇది అనవసర సన్నివేశం అనే ఫీల్ రాదూ. ఇక మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు కూడా ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పాత్రకు కూడా త్రివిక్రమ్ న్యాయం చేసిన విధానం బాగుంటుంది. సునీల్ హాస్యం, కోటా మాటలు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటాయి.
విలన్ ఎవరూ అనేది చివరి వరకు స్పష్టత రాకపోవడం ఒకటి అయితే… ప్రకాష్ రాజ్ పాత్ర తిప్పే మలుపులు, నాజర్ పోషించిన పాత్ర సినిమాకు హైలెట్ అయ్యాయి. సబ్జెక్ట్ ఉన్న వాళ్లకు సినిమా చాలా బాగా నచ్చుతుంది. బ్రహ్మానందం, హేమా మధ్య జరిగే సంభాషణ, త్రిష పల్లెటూరి అమ్మాయిగా నటించిన నటన అన్నీ కూడా కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఇక ఎమ్మెస్ నారాయణ కామెడి ఎక్కువ సేపు లేకపోయినా ఆకట్టుకుంటుంది.
ఇక రాజీవ్ కనకాల పాత్ర నుంచి వచ్చే సింపతి చివరి వరకు కొనసాగుతుంది. మహేష్ బాబు… బాసర్లపూడి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు చూపించిన ప్రేమ యువతకు బాగా నచ్చింది. ఇక తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ మధ్య సంభాషణ్ కూడా చాలా బాగుంటుంది. ఆడు మగాడు రా బుజ్జీ అనే డైలాగ్ ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది.