మన దేశంలో కొన్ని కొన్ని పద్దతులు చాలా అందంగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోకుండా కొందరు వింతగా ప్రవర్తిస్తారు. అలాంటి పద్దతే… సెలూన్ షాప్ నుంచి వచ్చినప్పుడు తల స్నానం చేయాలని చెప్పడం. స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు అనే నిబంధన విధించడం. అసలు ఆ నిబంధన విధించడానికి ప్రధాన కారణం ఏంటో చూద్దాం.
Also Read:దోమలు మంచి నీళ్ళ మీద ఎందుకు నిలబడవు…? వాటికి ఉండే అద్భుతమైన టెక్నిక్ ఏంటీ…?
దాదాపుగా ప్రతీ ఒక్కరి తల మీద కూడా సగటున లక్ష నుంచి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి. వీటిని కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు అవుతాయి. ఆ ముక్కలు మీరు ఎంత గుడ్డ కప్పినా సరే ఎంత బాగా బ్రష్ తో తుడిచినా సరే… మీ తల మీద, మెడ లేదా బట్టల మీద ఆ ముక్కలు అలాగే ఉంటాయి. 99% తుడిచినా మిగిలిన ఒక్క శాతం ముక్కలు మన శరీరం మీదనే ఎక్కువగా ఉంటాయి.
ఇక సెలూన్ షాప్ అంటే మనం మాత్రమే కాదు కదా…? ఇతరుల వెంట్రుకలు కూడా గాలికి మన శరీరం మీద పడే అవకాశం ఉంటుంది. వెంట్రుకల్లో అనేక రకాల క్రిములు ఉంటాయి. కుక్క బొచ్చు కంటే మనిషి గడ్డంలో, తల మీదనే ఎక్కువ క్రిములు ఉన్నాయని పరిశోధనలో కూడా వెల్లడి అయింది. కాబట్టి మీరు ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే గాలికి ఆ ముక్కలు ఇల్లు అంతా వ్యాపించే అవకాశం ఉంటుంది.
తినే పదార్ధాల మీద సైతం అవి పడే అవకాశాలు ఉంటాయి. అది అందరికి మంచి కాదు కాబట్టి కచ్చితంగా తల స్నానం చేసిన తర్వాతనే రావాలని చెప్తారు. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది కాబట్టి స్నానం చేయకుండానే… బెడ్ రూమ్ లోకి వెళ్లి, కాసేపు ఫోన్ తో ఆడుకుని, భార్యకు కబుర్లు చెప్పి… అప్పుడు గాని స్నానం చేయరు. పూర్వం ఇంత సినిమా లేదు కాబట్టి పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేసే వాళ్ళు.
Advertisements