భారతదేశంలో కొన్ని కొన్ని పద్దతులు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే నిమ్మకాయలు, ఎండు మిరపకాయలను గుమ్మానికి వేలాడదీయడం. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. తెలుసుకునే ముందు ఒక విషయం ఏంటీ అంటే అవి దిష్టి కోసం కాదు అనేది తెలుసుకోవాలి. పూర్వం రోజుల్లో ఎక్కువగా ఉండే ఇళ్ళు కేవలం మట్టి ఇళ్లు, గుడిసెలు, కట్టెలు/తడికెలు తో చేసినవి మాత్రమే.
ఈ విధమైన ఇళ్లల్లోకి ఎక్కువగా పురుగులు/క్రిములు/కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిమ్మకాయలు మరియు మిరపకాయలలో విటమిన్ సి పుష్టి గా దొరుకుతుంది. ఈ రెండు మంచి యాంటీ ఆక్సిడెంట్ లు కూడా. వీటిని దారం తో గుచ్చి వేలాడదీసి సమయంలో ఆ దారం మిరప/నిమ్మ లో గల రసాన్ని పీల్చుకుని ఆ దారం గుమ్మం వద్ద గాలిలోకి ఈ రసాన్ని వదులుతుందని నమ్ముతారు.
ఈ నిమ్మ వాసనకి, మిరప ఘాటుకు పురుగులు/క్రిములు/కీటకాలు దగ్గరికి వచ్చే అవకాశం లేదని బలమైన నమ్మకం. గుమ్మానికి మావిడి ఆకులు కట్టడం వెనుక కూడా ఇదే బలమైన కారణం. ఆకులు కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను ఇస్తాయి. పురుగులు/క్రిములు ఏవైనా ఉంటే ఆకుల వద్దే ఆగుతాయి. ఇక ఆకు పచ్చ రంగు చూడడానికి కూడా ఆహ్లాదంగా, టెన్షన్ రిలీఫ్, నేచర్ కి దగ్గరగా ఉంటుందని కట్టే వారు. ఈ మధ్య ఈ విషయం తెలియని వాళ్ళు ప్లాస్టిక్ వి కడుతున్నారు.