ప్రపంచం వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు దేవుళ్ళలా ఆరాధించే సినీ హీరోలు సైతం క్రికెట్ ని అభిమానిస్తారు. క్రికెట్ ప్లేయర్స్ ని ఆరాధిస్తారు.
ఇది ఒక్కటి చాలు క్రికెట్ ఎంత క్రేజీ ఆటో చెప్పడానికి. ఏదైనా కీలక మ్యాచ్ ఉందంటే చాలు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారనే టెన్షన్ లో ఉంటారు ఫ్యాన్స్. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? క్రికెట్ లో అన్ని దేశాల జట్లు ఉంటాయి.
Also Read: ఎన్టీఆర్ ఇంగ్లీషు యాసపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన హీరో
కానీ చైనా నుండి మాత్రం క్రికెట్ కి ఒక్క జట్టు కూడా ఉండదు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఒలంపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్ లో చైనా ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఒలంపిక్స్ లో ఎంతోమంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ సాధించారు.
కానీ క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఒక భాగం కాదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంతే కాకుండా చైనా క్రికెట్ ఆడకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే…చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు.
క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒక పీరియట్ లో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి.
చైనాలో ఎక్కువగా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ లోకి వస్తాయి.
క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్ కిందకి రాదు. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ లో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
అయితే, చైనాకి కూడా ఒక క్రికెట్ టీం ఉంది. 2009 లో ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో ఈ జట్టు పాల్గొంది. కానీ మొదట మ్యాచ్ లలో ఓడిపోయింది తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసుకుంది.
అంతే కాకుండా ఐసిసి చైనాలో కూడా క్రికెట్ ని ప్రమోట్ చేస్తోంది. 2019 లో జరిగిన టి 20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది.
Also Read: డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన గిల్.. రికార్డులే రికార్డులు