ఆహార పదార్ధాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆహార పదార్ధాలలో కూలింగ్ ఐటెం తిన్న సమయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అవి దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏమన్నా కూలింగ్ వస్తువు తాగినా, చాక్లెట్లు తిన్నా తర్వాతి రోజు తీవ్రంగా జలుబు చేసేస్తోంది కొందరికి. ఇలా తరుచూ జలుబు చేయడం దేనికి సంకేతం అనేది ఒకసారి చూద్దాం.
Also Read:ఉల్లిపాయలు తింటే చెమట వాసన వస్తుందా…? ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి…?
తరచుగా జలుబు చేయడం అనేది మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ బలహీనంగా ఉన్నట్టే. అది ఒకరకంగా వార్నింగ్ మనకు. లేదా ఆయా పదార్ధాలతో ఎలెర్జీ కూడా వచ్చి ఉండవచ్చు. మీ బాడీ ఇమ్మ్యూనిటి పెచుకోవడం అనేది ఒక రోజు నిమ్మకాయ తింటే లేదంటే ఒక రోజు ఎండలో ఉంటే జరిగే ప్రక్రియ మాత్రం కాదు. దాని కోసం ఒక మంచి ప్రణాళిక ఉండాల్సి ఉంటుంది. దీని కోసం ఒక సమగ్ర ప్రణాళిక మరియు దీర్ఘ కాలంలో ఆ ప్రణాళిక ని ఫాలో అవ్వగల నిబద్ధత మనకు ఉండాలి.
దీనిలో ఇటు ఆహారం, వ్యాయామ విషయాలు ఉండాలి. ఈ విషయంలో నిద్ర చాలా కీలకం అనే చెప్పాలి. డాక్టర్ కంటే కూడాఈ విషయంలో ఒక మంచి నిపుణుడి దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకోవాలి. జలుబు అన్నది బాగా తీవ్రతరమైతే అది న్యూమోనియా కింద రూపు చెందుతుంది కాబట్టి ఎంత మాత్రం లైట్ తీసుకోవద్దు. తినే ఆహారం విషయంలో అనవసర సలహాలు పాటించి జీవితం నాశనం చేసుకోవద్దు.