చుండ్రు అనేది అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్య నుంచి బయటకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలితం ఉండదు. చాలా మంది వైద్యం చేయించడం, నిపుణుల చుట్టూ తిరగడం వంటివి చేస్తూ ఉంటారు. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది ఏంటీ అనేది చాలా మందికి అవగాహన లేదు. మన శరీరం రోగ నిరోధక శక్తి కోల్పోయినప్పుడు చుండ్రు బయట పడుతుంది.
Also Read:బిర్యానితో మన హెల్త్ కు మంచి కూడా జరుగుతుందా…?
మూత్ర వ్యాధులతో పాటుగా థైరాయుడ్, విటమిన్ లోపాలు వంటి వాటి వల్ల శరీరం రోగ నిరోధక శక్తి కోల్పోతుంది. అప్పుడు చుండ్రు సమస్య తీవ్రంగా బయటపడుతుంది. శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోయినా సరే కిడ్నీలు స్వచ్చమైన రక్తాన్ని ఇచ్చినన్ని రోజులు చుండ్రు సమస్య ఉండదు. ఇక ఎక్కువ రోజులు హెల్మెట్ వాడటంతో పాటుగా… తల స్నానం చేయకపోతే చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇక తగ్గాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ అప్పుడప్పుడూ బీ కాంప్లెక్స్ విటమిన్ నెల పాటూ తీసుకుని మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి వాడితే చుండ్రు తగ్గుతుంది.
అలాగే టంక భస్మం అని దొరుకుతుంది. అది పొడి రూపంలో పతంజలి వాళ్ళు 5 రూపాయల రీఫిల్ ప్యాక్ లో అమ్ముతున్నారు. ఇక చంచాడు కొబ్బరి నూనెలో లేదా ఆవాల నూనెలో, లేదా నువ్వుల నూనెలో చిటికెడు వేసి ప్యాక్ లాగా వేసుకుని అరగంట ఉంచుకుని తల స్నానం చెయ్యాలి. వారానికి ఒకసారి అలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే మంచి వేప నూనె తలకి పట్టించి 2 గంటలు ఆరనిచ్చి స్నానం చేస్తే తగ్గిపోతుంది. కనీసం 2, 3 వారాలు వాడినా ఫలితం ఉంటుంది. ఇక తల స్నానం చేసిన తరువాత పిల్లో కవర్, టవల్ మార్చుకోవాలి.
Also Read:కొంపముంచిన 50 లక్షలు