చెవిలో గుబిలి అనేది కాస్త ఇబ్బందికరమే ఎవరికి అయినా. అందుకే గుబిలి విషయంలో చాలా మంది జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే గుబిలి మన శుభ్రం చేయాలా…? లేక దానంతట అదే వచ్చేస్తుందా బయటకు అనే సందేహం చాలా మందిలో ఉంది. చెవిలో సహజంగా పేరుకునే దుమ్ము,గుబిలిని శుభ్రం చేయడానికి శరీరం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఒకటి చెవి నిర్మాణం అందుకు అనుగుణంగా ఉంటుంది.
Also Read:పిడుగు పడితే ప్లగ్ ఎందుకు పీకాలి…?
చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా అడ్డుకుంటాయి. మిగిలిన దుమ్ము గుబిలికి అంటుకుంటుంది. అసలు గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది. ఆ గుబిలిని బయటికి పంపడానికి మన చెవి సహజ నిర్మాణం సహకరిస్తే మరొకటి మన దవడ కదలికలు శుభ్రం చేస్తాయి. ఆ కదలికలతో ఎండిన గుబిలి బయటికి వస్తుంది.
ఎక్కువ దుమ్ము చేరినా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ గుబిలి పెరిగి చెవి నొప్పి వస్తుంది. ఇక కొందరు… హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలో దుమ్మును శుభ్రం చేయడానికి కొందరు వాడతారు. అలా చేయడం కరెక్ట్ కాదు. ఒకటి రెండు చుక్కలు వేసుకుని… పలుచటి శుభ్రమైన గుడ్డని చెవి గోడలకి ఆనించి శుభ్రం చేయడం మంచిది. మోతాదుకి మించి వేస్తే… అక్కడ నీరు ఆక్సిజన్ గా మారి అక్కడే ఆగిపోతుంది. నిలిచిన నీరు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. దుమ్ము ఎక్కువ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Also Read:తెలంగాణలో అఘాయిత్యాలు.. జాతీయ మహిళా కమిషన్ దృష్టి!