అక్కినేని నాగ చైతన్య… నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జోష్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో మంచి హిట్ నే అనుకున్నాడు. నటుడిగా మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా చిత్రాలు చేశాడు. కొన్ని హిట్ సాధించగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.
ఇక మధ్యలో సమంతను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోటం ఇలా చాలానే జరిగాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో వరుస సక్సెస్ లను అందుకున్నాడు నాగ చైతన్య.
ఆషాడ మాసంలో అత్తా కోడలు ఓకే ఇంట్లో ఎందుకు ఉండకూడదో తెలుసా ?
ప్రస్తుతం ఆయన నటించిన థాంక్యూ సినిమా ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. ఇందులో చైతు సరసన రాశీ కన్నా హీరోయిన్ గా నటించింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.
కోడి రామకృష్ణ చివరి కోరిక ఇదేనంట
ఇక ఇప్పటికే విడుదలైన డైలాగ్స్ సైతం చైతు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయంటూ సమంతకి కౌంటర్ గానే ఇవి పెట్టారంటు కూడా టాక్ నడిచింది.
అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ తో ప్రమోషన్ లో పాల్గొన్నారు రాశి కన్నా. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ చైతు తాను సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటామని, ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటామని తెలిపింది.
Advertisements
అలాగే నాగచైతన్య వద్ద ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా నాగచైతన్యకు సైట్ ఉందని అందువల్లే అతను ఎంతో కాలం నుంచి అద్దాలను వాడుతున్నాడని తెలిపింది. స్టైల్ కోసం సినిమాల్లో అద్దాలను ధరిస్తుంటాడని చాలామంది అనుకుంటారని అసలు విషయం అది కాదని ఆయనకు సైట్ ఉందని తెలిపింది. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.