సోమవారం అనగానే శివుడుకి పూజించే రోజు అనేది అందరికి తెలిసిందే. అసలు సోమవారం శివ భక్తులు ఎందుకు పవిత్రంగా భావిస్తారు…? దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ…? ‘సోమ’కి స-ఉమ అనే అర్ధం ఉందట. సోమః అంటే ఉమయా సహితః శివః అని వ్యుత్పత్తి ఉందనేది పండితుల మాట. పార్వతితో కలిసి ఉన్న శివుడి పేరుని సోముడుగా చెప్తారు. అందుచేతనే శివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజట.
Also Read:భార్య గర్భంతో ఉంటే భర్త ఎందుకు గడ్డం తీయకూడదు…?
ప్రతి సోమవారం రోజున ప్రదోషకాలంలో పరమశివుడు, పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేసేవాడట. ఆ సమయంలో తనని ఎవరు అయితే పూజిస్తారో, వారి కోరకలు తప్పక సఫలం చేసేవాడని, నిష్కల్మశంగా పూజించేవారికి అంత్యాన తన సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడని శివపురాణంలో ప్రస్తావించారు. ఇక ఆ రోజున చాలామంది ఒక వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. దానినే సోమవార వ్రతం/శివదేవుని కథ అని అంటారు.
ఈ సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారాల్లో చేస్తే గనుక మంచి ఫలితం ఉంటుంది. ఈ వ్రతంలో సోమవార వ్రత మహిమను తెలిపే ఒక కథను కూడా పండితులు చెబుతారు. ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటీ అంటే… పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి, పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లారట ఆయన. అప్పుడే పార్వతీదేవికి ఉమ అనే పేరు స్థిరపడింది.
Also Read:నేను వెన్నెల.. ఇది నా కథ!