వయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమస్యల తీవ్రత జీవిత చరమాంకంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ బయట పడే సమస్యల్లో స్పాండిలోసిస్ అనే సమస్య కూడా ఒకటి. వెన్నెముక లోని డిస్కుల అరుగుదలకు సంబంధించి ఈ స్పాండిలోసిస్ అనే పదాన్ని వాడతారు. వయసు పెరిగే కొద్దీ ఇది తీవ్రంగా ఉంటుంది.
Also Read:ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడికి ఊరట..!
వృద్ధాప్యం అనేది మీ వెన్నెముకను ప్రభావితం చేసే విధానాలు, అలాగే ఇతర మార్పులతో పాటుగా సమస్యలకు దారితీస్తుంది. స్పాండిలోసిస్ సమస్యలో వెన్నెముక నిర్మాణంలో మరింత క్షీణతకు అలాగే మార్పులకు దారితీస్తుంది. ఈ లక్షణాలు మరింత ఇబ్బందిగా ఉంటాయి. రోగులు తరచూ కండరాల నొప్పులు లేదా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వైద్య బాషలో దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు.
ఈ ప్రాంతంలో డిస్కులు క్షీణిస్తూ చుట్టుపక్కల ఉండే నరాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా ఛాతీ, పక్కటెముకలు, ఉదర ప్రాంతాలలో తిమ్మిరి, జలదరింపు వంటివి వస్తాయి. మెడ లేదా సెర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏంటి అనేది చూస్తే… మెడ నొప్పి లేదా మెడ పట్టేసినట్టు ఉండడం అనేది ప్రధాన లక్షణం. మెడను కదిలిస్తే ఆ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. మెడ లేదా గొంతులో నొప్పి రావడం అలాగే మెడ కండరాల నొప్పులు రావడం జరుగుతుంది. మెడను కదిపితే క్లిక్ మనే శబ్దం వస్తుంది. మెడ తిప్పితే గనుక మైకం వస్తుంది. ఈ సమస్యను వెంటనే గుర్తించి మంచి చికిత్స తీసుకుంటే కచ్చితంగా బయట పడే అవకాశం ఉంటుంది.