జ్వరం” కొందరిని కంగారు పెట్టే ఒక చిన్న సమస్య. జ్వరం అనేది కొందరు లైట్ తీసుకున్నా సరే మరికొందరు మాత్రం జ్వరం కొంచెం ఉన్నా భయంతో ఆస్పత్రికి వెళ్తూ ఉంటారు. ఇక సీజన్ లో జ్వరం వస్తే మాత్రం చాలా మందికి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఏం చేయాలో అర్ధం కాక డబ్బులు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే… జ్వరం అనేది వ్యాధి కాదు.
Also Read:మొదటి గుండె మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు జరిగింది…? ఆ రోగి ఎన్ని రోజులు బ్రతికాడు…?
అది కేవలం ఏదోక వ్యాధికి లక్షణం మాత్రమే. మన శరీరంలో ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో అలాగే కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం వస్తు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ బాక్టీరియాతో, కలుషితం అయిన ఆహారం తీసుకుంటే… కలుషిత నీరు నీరు, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వస్తుంది. ఇక జ్వరం వచ్చిన వెంటనే కంగారు పడకుండా కొంత సమయం వేచి చూడాలి.
ఇక డాక్టర్ వద్దకు వెళ్తే… సదరు డాక్టర్… ఎందుకు జ్వరం వచ్చింది పరిశీలించి ఆ తర్వాత తగిన వైద్యం అందించడం. జ్వరం అంటే ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితుల్లో 98.6° F, .37°C గా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం తేడా ఉంటుంది. అందులో ఏ మాత్రం మార్పు వచ్చినా జ్వరం అంటారు. శరీరం కూడా వేడిగా ఉంటుంది. ఇది మరింత పెరిగితే జ్వరంగా చూడాలి. జ్వరం పెరిగితే కచ్చితంగా తల నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానితో పోరాడడానికి మన రక్తం లోని తెల్ల రక్త కణాలు సిద్దంగా ఉంటాయి. ఈ పోరాటంలోనే జ్వరం వస్తుంది.
Also Read:జ్వరం వస్తే చికెన్ ఎందుకు తినకూడదు…? అసలు తినడం మంచిదేనా…?