నోటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే దంత సమస్యలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇక ప్రతీ రోజు రెండు సార్లు కచ్చితంగా బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోరు వాసన రాకుండా వైద్యులు లేదా పెద్దలు చెప్పిన సూచనలు కచ్చితంగా పాటించాలి. ఇక మనలో చాలా మందికి ఉండే సందేహం… మనం నిద్ర లేచిన తర్వాత నోరు ఎందుకు వాసన వస్తుంది అనేది.
Also Read:భోజనం చేసే సమయంలో ఒళ్ళు ఎందుకు విరవకూడదు…?
మనం నిద్రపోయే ముందు… తిన్న పదార్థాలు కొన్ని నోటిలో చిక్కు కున్నప్పుడు, అవి కుళ్లిపోయి లేచినప్పుడు వాసన వస్తుంది. దీనికి విరుగుడు కచ్చితంగా ప్రతీ రోజు రెండు సార్లు బ్రష్ చేయడం. అరుగుదల లేకపోవడం కూడా నోరు వాసన రావడానికి కారణం అనే చెప్పాలి. కొన్నిసార్లు నోటికి మంచిగా అనిపించినా సరే అవి తిన్నప్పుడు సరిగ్గా జీర్ణించుకోలేక కూడా ,కుళ్ళిన వాసన వచ్చే అవకాశం ఉంది.
దీనికి విరుగుడు ఉంది కాని మనం పాటించడం కష్టం మరి. మనం ఏ పదార్దాలు హానికరమో తెలుసుకొని అవి మాత్రం తక్కువ తీసుకోవడం అనేది ఉత్తమం. కాని మనం ప్రతీ రోజు తినేది అవే. తినేవి ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటే మంచిది. ఇక నోరు మరీ దారుణంగా వాసన వస్తే గనుక మెడికల్ సైన్సు లో ఒక జబ్బు లక్షణం గా చేఫారు. అయితే యోగా సరిగా చేస్తే గనుక దీన్ని నుంచి బయట పడే అవకాశం ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు.
దీని నయం చేయడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయట. వీటితో గ్యాస్ నోట్లో నుంచి బయటకు వచ్చేసి మన నోరు ఫ్రెష్ గా ఉంటుంది అంటున్నారు. ఇక ఉపవాసాలు ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా నోట్లో నుంచి వాసన వచ్చే సమస్య ఉంది. తక్కువ ఆహారం తినడం, తినేవి జాగ్రత్తగా తినడం, యోగ చేయడం వంటివి చేస్తే గనుక ఈ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.
Also Read:అన్నాడీఎంకేలో ముదిరిన వివాదం.. పన్నీర్ సెల్వంపై దాడి