కరెంట్ తీగను ఒక్కదాన్నే పట్టుకుంటే మనకు కచ్చితంగా షాక్ కొడుతుంది. చెప్పులు వేసుకుని పట్టుకున్నా కొడుతుంది లేకుండా పట్టుకున్నా కొడుతుంది. అలాంటిది కరెంట్ తీగల మీద కాకులు గాని ఇతర పక్షులు గాని ఉంటే షాక్ కొట్టదు. అసలు ఎందుకు వాటికి షాక్ కొట్టదు అంటే… కొందరు చెప్పే సమాధానం వాటి కాళ్ళకు రబ్బరు ఉంటుంది అని అందుకే షాక్ కొట్టదు అని అంటారు కొందరు.
Also Read:మన కరెంట్ కు అమెరికా కరెంట్ కు తేడా ఎందుకు ఉంటుంది…?
కాని అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియని విషయం. పక్షికి కరెంట్ షాక్ తగలడం అంటే.. దాని శరీరం గుండా ఒకేసారి అధిక మొత్తంలో విద్యుత్ ప్రసారం జరగడం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కరెంట్ ఎప్పుడూ కూడా అతి తక్కువ నిరోధం నుంచి ప్రయాణం చేస్తుంది. పక్షులు కరెంట్ తీగపై వాలే సమయంలో మనం గమనిస్తే… అవి కేవలం ఒక తీగపైనే కూర్చుంటాయి.
ఆ తీగలో ప్రవహించే కరెంటుకి నిరోధం పక్షి శరీరంలో కంటే, ఆ తీగలోనే తక్కువ. అందుకే, ఆ కరెంటు తన ప్రవాహదిశని పక్షి శరీరం గుండా వెళ్లేలా మార్చుకోకుండా, ఆ తీగలోనే ప్రయాణం చేస్తుంది. అందుకే పక్షికి కరెంట్ షాక్ కొట్టదు. పక్షి అలా కూర్చోకుండా… పక్షి ఒక కాలుని ఒక తీగ మీద మరో కాలుని మరో తీగ మీద ఉంచితే షాక్ కొట్టి కింద పడిపోతుంది. ఆ రెండు తీగల మధ్యలో పక్షి శరీరం ద్వారా ఒక షార్ట్ సర్క్యూట్ ఒకటి ఏర్పాటు అవుతుంది. అందుకే గబ్బిలాలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతాయి.