నీరు తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓవర్ గా తాగితే అనవసరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నీళ్ళు ప్రతి రోజు కనీసం మూడు లీటర్లు అయినా తాగాలని, నీళ్ళు తాగే సమయంలో ఒక పద్దతిగా తాగాలి అనే సలహాలు మనం వింటూనే ఉంటాం. కాచి చల్లార్చి తాగితే మంచిది అని అంటూ ఉంటారు.
Also Read:కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా..? ప్రకృతి వైపరీత్యమా..?
అయితే కాచిన తర్వాత నీటి రుచి మారుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి కారణం చూద్దాం. చల్లని నీటిలో ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ వంటి వాయువులు కరిగిపోయి ఉంటాయి. వేడి చేయడం వల్ల ఈ వాయువులు నీళ్ళల్లో నుంచి బయటకు వెళ్తాయి. ఈ రెండు వాయువులను పోల్చి చూస్తే… కార్బండయాక్సైడ్ అతి తక్కువ స్థాయిలో పుల్లగా ఉంటుంది.
శీతల పానీయాలలో కార్బండయాక్సైడ్ వాడతారు కాబట్టే అవి పుల్లగా ఉంటాయి అంటారు. కాని ఆ పానీయాలలో పుల్లని రుచికి ప్రధాన కారణం ఫాస్ఫారిక్ అనే ఆమ్లం. నీటిలో ఉండే తాత్కాలిక కాఠిన్యత కలిగించే కాల్షియం, మెగ్నీషియం బై కార్బోనేట్లు కూడా వేడి చేసే ప్రక్రియలో బయటకు వెళ్తాయి. ఇక మన నాలుక పై ఉండే రుచి గ్రంధులు పులుపును చాలా వేగంగా గుర్తించడం జరుగుతుంది. పైవన్నీ నీళ్ళల్లో వేడి చేసిన తర్వాత పోతాయి కాబట్టి రుచిలో మార్పు ఉంటుంది.
Also Read:మాజీ సీఎం సంచలన నిర్ణయం…!