హిందూ సాంప్రదాయం అయినా మరో సాంప్రదాయం అయినా సరే వివాహం తర్వాత కచ్చితంగా భార్య పేరు మారిపోతుంది. భార్య పేరు మార్చాల్సిందే అనే వాళ్ళు కొందరు అయితే పేరు మార్చకపోతే వచ్చే నష్టం ఏంటీ అనే వాళ్ళు కొందరు. ఇక హిందూ సాంప్రదాయం విషయానికి వస్తే భార్య మెట్టింటికి వస్తే… సర్వ హక్కులు మెట్టింటి వారివే. ఒకరకంగా వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది.
ఇక పేరు, గోత్రం విషయంలో ప్రతీ ఒక్కటి కూడా మార్చుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. అయితే పుట్టింటి గోత్రాన్ని ఎందుకు మార్చాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. గోత్రం అంటే “గోవులను రక్షించుట” అని అర్ధం. పెళ్ళైన తర్వాత అత్త వారింటికి వచ్చిన తర్వాత వీరి ఇంటి గోవులనే రక్షిస్తుంది లేదా పోషిస్తుంది కాబట్టే కదా… అందుచేత గోత్రం కచ్చితంగా మారుతుంది.
Advertisements
పెళ్ళైన తర్వాత భర్త వీర్యము ను బట్టి ఆడ లేదా మగ పిల్లలు పుడతారు కాబట్టి కూడా గోత్రం మార్పు ఒక సంప్రదాయంగా మారిపోయింది. మన సంప్రదాయము లో భార్య పుట్టింటిని వదిలి అత్తింటి కి శాశ్వతంగా వస్తుంది కాబట్టి మరి ఆమె ఇల్లు మారినప్పుడు ఇంటిపేరు మరియు గోత్రం కూడా మారాలి. ఈ కాలంలో పాస్పోర్ట్ లు, వీసాలు, విద్యా ర్హతలు కారణంగా పేరు మార్చు కోవడం కాస్త కష్టంగా మారింది. ఇది ఒకరకంగా స్త్రీకి లభిస్తున్న గౌరవంగా చెప్తున్నారు కొందరు.