మన దేశంలో డాక్టర్ రైటింగ్ ఏ మాత్రం కూడా అర్ధం కాదు అనే మాట వాస్తవం. మనం ఎంత కష్టపడినా సరే ఆ భాష మెడికల్ షాపు వాళ్లకు మాత్రమే అర్ధమవుతుంది. లేదంటే మరో డాక్టర్ కు మాత్రమే అది అర్ధం చేసుకునే మేధస్సు ఉంటుంది. అసలు మన దేశంలోనే అలా రాస్తారా…? అన్ని దేశాల్లో అలా రాసే పద్ధతి ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. మరి మన దేశంలో ఆ పద్ధతి ఎందుకు ఫాలో అవుతున్నారు ఏంటీ అనేది చూద్దాం.
Also Read:బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు యాక్సిడెంట్.. గాయాలతో దైవ దర్శనం..!
మన దేశంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మనది రోగిస్ట్ దేశమా అంటారు. కాలు నొప్పి వచ్చిన వెంటనే, లేదంటే తల నొప్పి కాసేపు ఉంటే వెంటనే ఆస్పత్రికి పరిగెత్తి అనేక రకాల టెస్ట్ లు అడుగుతూ ఉంటారు కొందరు. దీనితో ఒక డాక్టరు సగటున రోజుకి వంద నుంచి 180 మంది రోగులను కలవాల్సి ఉంటుంది. ఆర్ ఎంపీ వైద్యుల పరిస్థితి కూడా చాలా గ్రామాల్లో అలాగే ఉంటుంది. అదే విదేశాల్లో అంటే అభివృద్ధి చెందిన లేదా జనాభా తక్కువ ఉన్న దేశంలో వాళ్లకు సమస్య వస్తే ముందు అవగాహన తెచ్చుకుంటారు.
మన దేశంలో మాదిరి చాలా దేశాల్లో వెంటనే వైద్యుల వద్దకు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. విదేశాల్లో సగటున రోజుకి పది నుంచి 18 మంది రోగులు డాక్టర్ ను కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా వైద్యం చేస్తే దానికి సంబంధించి మందులను రికార్డ్ చేసి సాహాయకురాలి ద్వారా టైపు చేయించి దాన్ని ఫైల్కు అతికించి ఇస్తారు. మన దగ్గర రోగులు ఎక్కువ మంది ఉండటంతో డాక్టర్ కు అంత సమయం ఉండదు. ముందు అక్షరం ఒక్కటే అర్ధమయ్యే విధంగా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుని మెడికల్ షాప్ లో మందులు ఇస్తారు. ఇక ఇది మన దేశంలో క్రమంగా కామెడీగా మారిపోయింది.
Advertisements
Also Read:తనపై జరిగిన దాడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్