చాలా మంది ఏడ్చే సమయంలో ముక్కు నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. అలాగే మనకు జలుబు చేసిన సమయంలో కూడా కొందరికి కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. చాలా మంది ఇలా నీళ్ళు రావడాన్ని కళ్ళ కలకలు అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా వేడి వేడి ఆహారం తిన్నా లేదా కారంగా ఉండేవి తిన్నా సరే కంట్లో నుంచి ముక్కులో నుంచి కూడా నీళ్ళు కారుతూ ఉంటాయి.
Also Read:నాలుకపై టేస్ట్ బడ్స్ ఎలా పుడతాయి…? వాటి లైఫ్ టైం ఎంత…?
దాని వెనుక ఉండే ప్రధాన కారణం ఏంటో చూద్దాం. మన ముఖం లో కంటి కి సంబంధించిన డక్ట్ అనేది ముక్కుకి సంబంధించిన నాసల్ డక్ట్స్ దెగ్గర దెగ్గరగా ఉంటుంది. మనం ఎప్పుడయితే ఏడ్చామో అప్పుడు ఈ టియర్ డక్ట్ నీటితో నిండిపోయి నాసల్ డక్ట్స్ కి మిగిలిన నీటిని పంపిస్తూ ఉంటుంది. అప్పుడు ముక్కు ఏడవడం మొడలుపెడుతుంది గాని అది ఏమీ అనారోగ్య సమస్య కాదు.
అలాగే మనం కారం తిన్నపుడు మనం ఏడవకుండానే ముక్కు నుండి నీళ్ళు కారుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే… మనం స్పైసీ ఫూడ్ తిన్నపుడు చిల్లీ , పెప్పర్ లో క్యాప్సైసిన్ అనేది ఉంటుంది. అది ఉండడం వల్ల మనం అలాంటివి తిన్నప్పుడు కళ్ళు తట్టుకోలేక ఎర్రగా అవుతూ ఉంటాయి. అప్పుడు ముక్కు కూడా ఇరిటేట్ అయి నీళ్ళను విడుదల చేస్తూ ఉంటుంది.
Also Read:వాహనాల భద్రతకు నూతన విధానం..!