వయసు పైబడిన వారిని లేదా కొందరు ఆడవాళ్ళను గనుక మనం గమనిస్తే వాళ్ళ కాళ్ళకు నీరు పడుతుంది. ఆ కాళ్ళు ఉబ్బిపోయి కనపడుతూ ఉంటాయి. వాటితో వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా ఎక్కువ దూరం నడిస్తే సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇక కాళ్ళ నొప్పుల సమస్యలు కూడా వారిని ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది ఏంటీ అనేది చూద్దాం.
Also Read: డెబిట్ కార్డులో సీవీవీ అంటే ఏంటీ…? దాన్ని ఎలా తయారు చేస్తారు…?
గంటల తరబడి కూర్చోడం వలన వాపులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎడిమా అని పిలుస్తారు. ఎక్కువ సమయం కూర్చోవడంతో ఏ విధమైన రక్త ప్రసరణ జరుగకుండా కాళ్ళు అలా ఉండిపోయి పొంగి వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రుచికరంగా ఉందని ఉప్పు ఎక్కువగా తిన్నా కూడా ప్రమాదమే మరి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన అధిక నీరు ఉండడం వలన కాళ్లలో ఎక్కువగా నీరు చేరే అవకాశాలు ఉన్నాయి.
గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలతో కూడా కాళ్ళకి నీరు పట్టే అవకాశాలు ఎక్కువ. దీర్ఘకాలిక సమస్య థైరాయిడ్ తో కూడా కాళ్ళకు నీళ్ళ సమస్య వస్తుంది. ముఖ్యంగా 45 యేళ్లు దాటిన స్త్రీల లో ఈ సమస్య ఎక్కువగా చూస్తాం. కాళ్ళు ఎక్కువగా వాచిపోయి కనపడతాయి. ఇక బోదకాలు సమస్య కూడా ఎక్కువగానే వస్తుంది వీళ్ళకు. ఈ విషయంలో అలెర్ట్ గా లేకపోతే మాత్రం ఆ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఉప్పు వాడకం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. మాంసాహారం ఎక్కువగా తినడం మంచిది. గుండె బలహీనంగా ఉన్నప్పుడు కూడా కాళ్ళకు నీళ్ళు చేరతాయి కాబట్టి గుండెను ఆరోగ్యంగా చూసుకోవాలి. రక్తప్రసరణ తగ్గిన చోట నీరు చేరుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని వ్యాయామం చేయాలి. రక్తం ఎప్పుడూ పలచగా,నిరంతరం ప్రవహిస్తూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వ్యాయామం, మంచి నిద్ర, మంచి ఆహారం ఉండాలి.
Also Read: జవాన్ గా బాద్ షా