దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు రెండున్నర లక్షలు దాటుకొని 3 లక్షలు వైపుగా పయనిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో గత వారం డోలో 650 మాత్ర ట్విటర్ ట్రెండింగ్‌గా మారింది. దీంతో ట్విట్టర్ కాస్త డోలో 650 మేనియాగా మారింది. ప్రస్తుతం ట్విట్టర్లో #Dolo650 అనే హ్యాష్ ట్యాగ్ షేక్ చేసింది. దానికి కారణం లేకపోలేదు. సెకండ్ వేవ్ లో డోలో 650 అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి.
2021 డిసెంబర్ లో డోలో 650 రూ.28.9 కోట్ల అమ్మాకాలు జరిగాయి. డిసెంబర్ 2020తో పోల్చుకుంటే ఇది 61.45 శాతం ఎక్కువ. 2021 ఏప్రిల్, మేలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ లో రూ. 48.9 కోట్లు, మే రూ. 44.2 కోట్ల అమ్మకాలను సాధించింది. మార్చి 2020 నుండి ఇప్పటి వరకూ రూ. 567 కోట్ల విక్రయాలు జరిగాయి. అయితే ఈ స్థాయిలో వైద్యులు డోలో 650కి సూచించడంపై పెద్ద చర్చ జరుగుతుంది.
అన్ని వయసుల వారికి కూడా ఈ మెడిసిన్ పని చేస్తుందని.. దీంతో ప్రతీ ఒక్కరికి వైద్యులు ఈ మందులు సూచిస్తున్నారని వైద్యు నిపుణులు చెబుతున్నారు. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ర్ ఉండవని అంటున్నారు. ఫీవర్ కి పరీక్షలు చేసిన తరువాత చాలా సాధారణంగా ఈ మందులను వైద్యులు సూచించొచ్చని తెలిపారు. పారాసెటమాల్ కి చెందిన మిగిలిన బ్రాండ్స్ క్రోసిన్, కాల్పోల్, పాసిమోల్ లాగే డోలో 650 కూడా పని చేస్తుందని.. దీంతో వీటికి బదులు డోలో 650 ఇస్తున్నారని చెప్పారు.
ఇది చాలా సురక్షితమైన మెడిసిన్ అని.. అన్ని వయసుల వారు.. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడేవారు కూడా తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు కరోనా ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఇలాంటి వాటికి డోలో 650 బాగా పని చేస్తుందని తెలిపారు. దీంతో.. అన్ని రకాలుగా ఈ మెడిసిన్ సేఫ్ అని అంటున్నారు. ఈ కారణాల వలనే దీని విక్రయాలు భారీగా జరుగుతున్నాయని చెప్పారు. థర్డ్ వేవ్ లో కూడా ఈ స్థాయి వాడకం కొనసాగుతోందని అంటున్నారు.