వర్షా కాలం వస్తుంది అంటే చాలు దోమల దెబ్బకు ప్రజలకు చెమటలు పడతాయి. దోమల బారి నుంచి బయట పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చే వ్యాధుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త సీరియస్ గా ఉంటున్నాయి.
ఇదిలా ఉంటే దోమలు మనల్ని ఏయే సందర్భాల్లో కుట్టవు ఏంటీ అనేది తెలుసుకుందాం. ఏసీ రూమ్ లో ఉంటే… అంటే ఏసీ ఆన్ లో ఉంటే దోమలు కుట్టవు. దోమలు హాయిగా తిరగటానికి, తమ ఆహారం సంపాదించుకోవటానికి అనువైన ఉష్ణొగ్రత 80°F గా చెప్తున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఎయిర్ కండీషనర్ ఆన్ చేస్తామో అప్పుడు గది ఉష్ణోగ్రత పడిపోతుంది. ఎంతగా అంటే ఆ ఉష్ణోగ్రత పరిధికి దోమలు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా.
దానివల్ల, వాటిలో చురుకుదనం తగ్గిపోతుంది. దీనితో ఆ సమయంలో కాటు వేసే అవకాశం తక్కువ. అయితే ఏసీ ఆపేసిన తర్వాత దోమలు మళ్ళీ డ్యూటీ ఎక్కుతాయి. సమశీతోష్ణ వాతావరణంలో దోమలకు రెక్కలు ఆడవు అందువల్ల అవి స్తబ్దుగా ఉండిపోవడం జరుగుతుంది. ఏసీ ఆపేయగానే అవి విజృంభిస్తాయి. అలా అని దోమల కోసం ఏసీ వేస్తే బిల్లు చూసి గుండెపోటు వస్తుంది మరి.