వర్షా కాలం వచ్చింది అంటే చాలు దోమల దెబ్బకు అందరూ జాగ్రత్త పడాల్సిందే. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే దోమల దెబ్బ నుంచి బయట పడటం సాధ్యం కాని పని. వీటి కారణంగా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం వర్షా కాలం కావడంతో దోమల నుంచి తాత్కాలిక రక్షణ కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
Also Read:ఎర్ర గుడ్డ చూస్తే నిజంగా ఎద్దుకి కోపం వస్తుందా…?
ముఖ్యంగా నీళ్ళు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా దోమలు నివాసం ఉంటాయి. అక్కడే కాపురం చేసి పిల్లల్ని కంటూ ఉంటాయి. అయితే దోమలకు ఉండే ఒక టెక్నిక్ మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. దోమలు సాధారణంగా నీళ్ళ మీద నిలబడతాయి. ఏ జీవి కూడా నీళ్ళ మీద అంత స్వేచ్చగా నిలబడటం సాధ్యం కాదు. అలా నిలబడటానికి ముఖ్య కారణం దోమల కాళ్ళ ఆకృతి మరియు వాటి జాయింట్స్ డిజైన్.
వాటి కారణంగా తమ బరువుకి 23 రెట్ల బరువుని నీళ్లపై తేలేలా చెయ్యగలిగే సామర్ధ్యం దోమలకు ఉంటుంది. నీళ్ళల్లో సర్ఫేస్ టెన్షన్ పుట్టించడం ద్వారా మామూలు నీళ్లలో మురుగు నీళ్లలో అంత సులువుగా నిలబడతాయి. అందుకే మంచి నీళ్ళు ఉండే చెరువుల్లో దోమలు పెద్దగా కనపడవు. నీళ్ల మీద తేలే విధంగా చేసే రోబోట్ ల డిజైన్ కు దోమల కాళ్ళ ఆకృతి స్ఫూర్తి అని చెప్తున్నారు నిపుణులు. అయితే నీళ్లలో కొంచెం సబ్బు లేదంటే… నూనె కలిసినా సరే అవి నీళ్ళల్లో ములిగిపోతాయి. నీళ్ళ మీద తేలే విధంగా చేసే ప్రక్రియలో ఆ సమయంలో. తేడా వస్తుంది.
Advertisements
Also Read:ఆ ఎంపీలపై సస్పెన్షన్ వేటు..!