ఈ రోజుల్లో విమాన ప్రయాణాలు అనేవి కాస్త కామన్ గా మారాయి గాని గతంలో విమాన ప్రయాణం అనేది ఒకరకంగా గొప్ప అనే చెప్పాలి. ఇక విమానం విమానం నడపడం అనేది ఒక సవాల్ అనే చెప్పాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నడుపుతారు విమానాన్ని. ఏ మార్గంలో వెళ్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటీ అనేది ఒక పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. సముద్ర, పర్వత ప్రాంతాల్లో వెళ్ళే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు ఉండాలి.
Also Read:వాటి నుంచి బయటపడేందుకుపోరాటం చేస్తున్న..
ఏ మాత్రం తేడా వచ్చినా సరే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక విమానాలు కొన్ని పర్వతాలు, సముద్రాల మీద ఎగరకుండా, వేరే దారి గుండా ప్రయాణించడానికి కారణాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. హిమాలయా పర్వత శ్రేణి, సముద్రాలు మొదలైన వాటి మీదుగా విమానాలు ఎగరకపోవటానికి కారణాలు చాలా బలంగా ఉంటాయి. హిమాలయ పర్వతాలు 20,000 నుంచి 29 వేల అడుగులు ఎత్తులో ఉండటం ప్రధాన కారణం.
విమానాలు అంత కన్నా ఎత్తు ఎగరగలవు. అయితే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తల తిరగటం, వాంతులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కారణంతో అయినా క్యాబిన్ ప్రజర్ చెడిపోతే గనుక ప్రయాణికులకి ఆక్విజన్ 10–15 నిమిషాలు మాత్రమే విమానంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు వేగంగా 10,000 అడుగుల ఎత్తుకి విమానం రావాల్సి ఉంటుంది.
లేదంటే గనుక ప్రయాణికులు బ్రతికే అవకాశం ఉండదు. హిమాలయా తరహా పర్వాతలపై అది సాధ్యం కాదు. ఏదైనా సమస్య వస్తే… ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దగ్గర లొ విమానాశ్రయాలు గాని బల్లపరుపు నేలలు గాని ఉండవు. సాంకేతిక సమస్యలు తలిత్తితే సముద్రం మధ్యలో ఆపడం సాధ్యం కాదు. వాతావరణ పీడనం ఏ వైపు తక్కువ ఉంటుందో అటు విమానాలు వెళ్తాయి.