మన ఆరోగ్యానికి పాలు ఎంతగానో మంచివి. రోజు గ్లాస్ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే చిన్న పిల్లలకు పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇక పెద్దలు కూడా పాలు తాగితే మంచిది. అయితే చాలా మందికి పాలు కాచి ఎందుకు తాగాలి, పచ్చి పాలు ఎందుకు తాగకూడదు అనేది తెలియదు. పచ్చి పాలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు.
Also Read:బిట్టూ కరాటేపై కాశ్మీర్ పండిట్స్ కుటుంబ సభ్యుల పిటిషన్
గ్రామాల్లో గేదె నుంచి పాలు తీసిన వెంటనే తాగే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అయితే అలా పచ్చి పాలు తాగడం ఎంత మాత్రం మంచిది కాదు. అందులో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి కచ్చితంగా పాలు పొంగు వచ్చిన తర్వాతనే తాగాలి. గేదె దగ్గర పొదుపు పాలు కాబట్టి దాన్ని శుభ్రం చేయరు. ఆ నీళ్ళు కూడా శుభ్రంగా ఉండవు. అవి పాలల్లో పడుతూ ఉంటాయి అలాగే ఆ గేదెలు మురికి కాలువల్లో కూడా తిరుగుతూ ఉంటాయి.
ఇక ఆ పాలు తెచ్చే వాడు కూడా అందులో నీళ్ళు కలిపితే ఏ నీళ్ళు కలుపుతాడో మనకు తెలియదు. కాబట్టి ఆ పాలను కాచి తాగాల్సి ఉంటుంది. ఇక పచ్చి పాలు తాగితే అనేక రకాల అలర్జీలు వస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో ప్యాకెట్ పాలు ఎక్కువగా వాడుతున్నాం. అందులో పౌడర్ కలిపి పాల కింద తయారు చేస్తున్నారు.
Also Read:స్విమ్ సూట్ లో మత్తెక్కిస్తున్న లిసా… పిక్స్ వైరల్