పోలీసులు కేసులు నమోదు చేసే అంశానికి సంబంధించి, చట్టాల గురించి అవగాహన లేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. చిన్న విషయాల మీద కూడా అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి ఒక విషయమే పోలీసులు ఎఫ్.ఐ.ఆర్.లో ఫిర్యాదు దారుల, నిందితుల కులం ఎందుకు నమోదు చేస్తారు అనేది.
Also Read: కాటికి పోయే వయసులో కూటి కోసం తప్పలు..!
మన దేశంలో కుల వ్యవస్థ ఎన్నో వందల వేల సంవత్సరాలుగా సమాజంలో ఒక ప్రముఖ పాత్రతో ఉంది. ఈ కుల వ్యవస్థలో ఎన్నో కులాలు, వారి వృత్తులు, మనుగడ , జీవన పద్ధతులు , అలవాట్లు , ప్రవుత్తులు మమేకం అయ్యాయి. వీటి వలన వారి నేర ప్రవృత్తి కానీ , నడవడిక ,అవసరం ఇత్యాదులు ఇమిడి ఉండేవి. ఈ క్రమంలోనే పూర్వం నేర పరిశోధన , గుర్తింపు లాంటివి పరిగణకు తీసుకొనే వారు. పలు కీలక విషయాలను కులం ఆధారంగానే సేకరించే వారు. కుల పరమైన కేసుల్లో కూడా కులం వ్యవహారం అత్యంత కీలకంగా ఉండేది.
విదేశీ పాలనలో ముస్లిం, యురోపియన్ వారు కూడా వాటిని పాటించారు. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో సమాజాన్ని కులం పరంగా బాగానే విడగొట్టారు. మన దేశ సమాజాన్ని కూలంకుశముగా అధ్యయనం చేసి పోలీస్ శాఖలో ఆ పద్దితిని బలంగా అనుసరించారు. ఇప్పటికీ పోలీస్ శాఖ తమ ప్రాధమిక విచారణలో కులం పేరు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అయితే దీని మీద పెద్దగా ఎవరూ దృష్టి సారించలేదు కాబట్టి అలాగే కొనసాగుతుంది.
Also Read: దోచుకోవడానికే వచ్చావా..? ఆగం చేయడానికి వచ్చావా..?