హస్తినకు పోయారు. చర్చలు జరిపారు. ఇక ముహూర్తమే తరువాయి అనుకున్నారు. అయినా ఇంకా కండువా మార్చలేదు. జెండా ఎత్తలేదు. ఆగిపోయిందా? లేక సాగుతోందా? ఏం జరగుతోంది? అందరికీ ఇవే అనుమానాలు.
మాజీ మంత్రి గంటా శ్రినివాసరావుకు సైలెంట్ కిల్లర్ అనే ముద్దు పేరు ఉంది. ఎక్కువగా మాట్లాడకుండానే.. చాలా పనులు చక్కబెట్టేసుకునే టాలెంట్ ఉందని అంటారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లినా.. ప్రజారాజ్యంలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినా.. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశంలోకి వెళ్లినా.. ఎక్కడా తన వాల్యూ తగ్గించుకోలేదు.. స్టేటస్ మార్చుకోలేదు. పైగా అన్ని చోట్ల తనకంటూ ఓ స్టేచర్ మెంటెయిన్ చేశారు.. చేస్తున్నారు. ఆరోపణలు ఎన్ని వచ్చినా.. ఆర్ధిక అంశాలు ఇబ్బందులు పెట్టినా.. తొణకలేదు.. బెణకలేదు.
కేసిఆర్ ను వెంటాడుతున్న జాతీయ మీడియా
బిజెపిలోకి త్వరలోనే గంటా జాయిన్ అవుతారనే వార్తలొచ్చి నెల దాటిపోయింది. అయినా ఇంకా ఆయన చేరలేదు. ఈ లోపు ఆయన ఆస్తులు వేలం వేస్తున్నారనే వార్తలు ఆయన వర్గాన్ని కలవరపెట్టాయి. ఇప్పుడు ప్రత్యర్ధులు అయితే దీని వలనే కమలం కాలడ్డం పెట్టిందని.. గంటా బిజెపి ఎంట్రీ ఆగిపోయిందనే ప్రచారం ఎత్తుకున్నారు. మరోవైపు గంటా, ఆయన అనుచరులు దాదాపు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం మానేశారు. చంద్రబాబు కార్యక్రమాలకు గంటా శ్రినివాసరావు హాజరవటం లేదు కూడా. వైసీపీ కూడా గంటా కోసం ప్రయత్నించిందనే వార్తలు ఉండటంతో .. కొందరి అనుమానాలు అటువైపు తిరిగాయి.
ప్రధాని ఆఫర్ ను తిరస్కరించాను : శరద్ పవార్
అయితే గంటా అనుచరవర్గాలు మాత్రం ఈ ప్రచారాలను కొట్టిపారేస్తున్నాయి. గంటా, ఆయనతో పాటు మరికొందరు బిజెపిలో చేరడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. కేవలం బిజెపి మహారాష్ట్ర ఎపిసోడ్ లో బిజీ అవడం వలన ఆలస్యమైందని.. ఇక త్వరలోనే మరో దఫా చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. అందులో గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరినా.. తన కేంటో.. తనతోపాటు చేరే నేతలకు ఏంటో క్లారిటీ లేనిదే ముందడగు వేయరని వారంటున్నారు. అసలు అలా గ్రూప్ ను ఎప్పుడూ మెయిన్ టెయిన్ చేయడం వలనే.. ఏ పార్టీలో అయినా ఆయనకు వెయిటేజీ దక్కిందని చెబుతున్నారు. ఈ నెలలోనే గంటా బిజెపిలో చేరతారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.