మహిళలను అత్యాచారం చేసి హత్య చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. కఠినమైన చట్టాలు తేవాలి. త్వరితగతిన న్యాయస్థానాలు తీర్ప్పులు ఇవ్వాలి అని ముఖ్యమంత్రులు, రాజకీయనాయకులు కోరడం ఆవ్వహనించదగ్గ పరిణామం. కాకపోతే చట్టాలు చేసే ఎమ్మెల్యే లు, ఎంపీలు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు రాజకీయాలను అత్యాచారం చేస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి విలువలను హత్య చేస్తున్న వారికి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన శిక్ష పడే పడేవిధంగా కఠిన చట్టాలను తేవాల్సిన అవసరం వుంది.
శిక్షలు, కఠిన చట్టాలు కేవలం ప్రజలకే కాదు.. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యే ఎంపీ లకు కూడా తేవాలి. అదేమంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పి తప్పించుకోడం అయిపొంది. నేరాలు చేసేవారు కూడా ఇలాగే చెప్తారు. తాగిన మత్తులో తెలియక చేసాను అని ఒకరు, మానసిక ఒత్తిడితో చేసాను అని ఒకరు, మిత్రుల ఒత్తిడితో చేసాను అని మరొకరు ఇలా కుంటి సాకులు చెప్తారు. పార్టీలు మారే రాజకీయ నాయకులు… ఎమ్మెల్యే ఎంపీ లు చెప్పే మాటలు విని నేరస్థులు కూడా తాము చేసిన నేరాన్ని పరోక్షంగా సమర్ధించుకుంటారు. అందుకే మహిళలను అత్యాచారం చేయడం హత్య చేయడం ఎంత నేరమో రాజకీయ విలువలు హత్య చేయడం కూడా అంతే నేరం. దానికి కూడా కఠిన చట్టాలు ఉండాలి. త్వరితగతిన తీర్పులు వచ్చేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. లేదంటే ఐదు సంత్సరాలపాటు పదవీకాలం పూర్తి చేసుకొని బయటపడుతున్నారు. ఫిరాయింపుకు వెంటనే శిక్ష పడితే ఇంకొకరు ఆ తప్పు చేయరు.
అప్పుడు రాజకీయ విలువలు కాపాడబడతాయి. రాజకీయ విలువలు ఉంటే సామాజిక విలువలు కూడా సమాజంలో ఉంటాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు, చట్టాలకు విలువ ఇవ్వాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు విలువలను గౌరవించికుండా చట్టాల్ని తుంగలోతొక్కి, వారి ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ ప్రజలను మాత్రం క్రమశిక్షణలో ఉండాలి అని చెపితే ఉపయోగం లేదు. అందుకే పార్టీ ఫిరాయింపుల కేసులను త్వరితగతిన విచారించి, తీర్పులు ఇచ్చేవిధంగా చట్టాలు తేవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ప్రజలకు నాయకులు ఆదర్శంగా ఉండాలంటున్నారు పలువరు మేధావులు.