తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నడుస్తుంది. జంబో బ్యాలెట్ తో ఫలితాల ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. పైగా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశం కనపడటం లేదు. సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తైతేనే… గెలుపు పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే… నల్గొండ-వరంగల్-ఖమ్మం సీటులో మొదటి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తైంది. ఇందులో 1,50వేలకు పైగా ఓట్ల లెక్కింపు జరగ్గా… 9252ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ప్రతి రౌండ్ లోనూ 3వేల పైచిలుకు ఓట్లు చెల్లుబాటు కావటం లేదు. ఇటు హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి స్థానం నుండి రెండు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇందులో 1.20లక్షల ఓట్లు లెక్కించారు. ఇక్కడ కూడా 6400కుపైగా ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంటే ప్రతి రౌండ్ లో ఇక్కడ కూడా 3వేలకు పైగా ఓట్లు ఇన్వాలిడ్ గా ఉన్నాయి.
ఈ ఓట్లు దాదాపు ఓ అభ్యర్థి సాధించిన ఓట్ల కన్నా ఎక్కువ. దీనిపై సహజంగానే అసంతృప్తి వ్యక్తం అవుతుంది. చదువుకున్న వారి ఓట్లు చెల్లుబాటుకాకపోవటంపై మండిపడుతున్నారు. అసలు వీరు డిగ్రీ చదువుకున్న వారేనా…? వీరికి ఉద్యోగాల నోటిఫికేషన్లు కాకుండా నిరుద్యోగ భృతియే బెస్ట్ అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. వీరి వల్లే గెలుపోటములు తారుమారయ్యేలా ఉన్నాయంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.