చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు రంగు మారుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా వరకు కష్టపడుతూ ఉంటారు కొందరు. వేలకు వేలు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు ఎందరో ఉన్నారు. ఇక ఇదిలా ఉంచితే అసలు చిన్న వయసులోనే జుట్టు ఎందుకు రంగు మారిపోతుంది… అంటే బాల మెరుపు ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. అసలు జుట్టు నల్లగా , తెల్లగా ఎందుకు ఉంటుంది అనేది తెలుసుకుందాం.
Also Read:ఉగ్రవాదుల చేతుల్లో మరో కశ్మీరి పండిట్ హతం
వెంట్రుకల కుదుళ్లలో ఉత్పత్తి ఐఏ మెలనిన్ తగ్గడం వల్ల వెంట్రుకలు తెల్లగామారిపోతాయి . అమెరికా దేశంలో చలి చాలా ఎక్కువుగా ఉండటంతో సూర్యుడి కిరణాల ప్రభావం ఎక్కువుగా ఉండదు. అందువల్ల అక్కడివాళ్లకు మెలనిన్ రేణువుల అవసరం లేక జుట్టు వారికి తెల్లగా ఉంటుంది. ఇక మనకు సూర్యుడి కిరణాలు ఎక్కువుగా ఉంటాయి కాబట్టి మెలనిన్ ఎక్కువుగా ఉంటుంది.
చిన్న వయస్సులో జుట్టు ఎందుకు తెల్లగా మారుతుంది అనేది చూస్తే… వైద్య భాషలో దీని పెరు కెనాయిటిస్ అంటారు. కెనాయీటిస్ సమస్య ఉన్న వ్యక్తులు జుట్టు కు రంగుని కల్పించే పిగ్మెంట్లు కణాలతో సమస్య ఎదుర్కొంటారు. అందుకే వారి జుట్టు తెల్లగా ఉంటుంది. జన్యు పరమైన సమస్యలు, ఆహారంలో ప్రోటీన్ల లోపం, హార్మోన్ల లో తేడాలు, కొన్ని జబ్బులు ఉన్న వారికి జుట్టు రంగు మారిపోతుంది. మనిషి పుట్టినప్పటి నుంచే ఈ జన్యువులే రంగు రూపు మొదలైన వాటిని నిర్ణయిస్తూ ఉంటాయి.ఒక్క సారి గనుక కెనాయీటిస్ వస్తే దానినుండి బయటకు రావడం కష్టమే. చిన్న తనం నుంచే పోషకాహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటకు రావచ్చు.
Also Read:ఆరుగురు పిల్లలను చంపిన కన్నతల్లి