సిజేరియన్” ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట ఇది. పూర్వం ఎక్కడో డబ్బు ఉన్న వాళ్ళు నొప్పులు తెలియకుండా బిడ్డను కనడానికి ఎంచుకునే పద్దతిని ఈ మధ్య కాలంలో పేదలు కూడా ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అసలు పూర్వానికి ఇప్పటికి మారిన ఆహారపు అలవాట్లు ఏంటీ…? ఎందుకు చాలా మంది సిజేరియన్ ను ఇష్టపడుతున్నారు.
Also Read: పానీపూరి తింటున్నారా..? మీకో బ్యాడ్ న్యూస్
బిడ్డ కడుపున పడిన నాటి నుంచి శారీరక శ్రమ ఎక్కువగా జరిగేది. ఆహారం విషయం లో కూడా జాగ్రత్తలు ఎక్కువగా పాటించడం జరిగింది. వాళ్లకు పుట్టినప్పటి నుంచి కూడా మంచి బలమైన ఆహారం అందడం జరిగేది. అనారోగ్య సమస్య లు లేకుండా ఆరోగ్యంగా ఉండే వారు. గర్భంతో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఎక్కువ చేయడం ద్వారా శరీరంలోని కండరాలు ప్రసవ సమయానికి వదులుగా ఉండి సుఖ ప్రసవo జరుగుతుందని నమ్మి, శ్రమ ఎక్కువ చేసారు. ఇప్పుడు బెడ్ రెస్ట్ అనే మాట కొంప ముంచుతుంది.
శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది. ఆరోగ్య సమస్యలు వల్ల కొందరికి సిజేరియన్ తప్పటం లేదు. మరికొందరు పురిటినెప్పులు భరించలేక సిజేరియన్ చేయించుకోవడం గమనార్హం. ఇక డబ్బులు ఎక్కువగా వస్తాయని కొందరు వైద్యులు కూడా సిజేరియన్ అనే మాట మాట్లాడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. తినేది ఎక్కువ, పని చేసేది తక్కువ అవడం ప్రధాన సమస్య. అలాగే సరైన ఆహారం లేక రక్త హీనతతో కూడా ఆపరేషన్ లు చేస్తున్నారు.
నెలలు నిండకుండానే నెప్పులు రావడం ఒక సమస్య అయితే… నెలలు పూర్తి అయినా సరే కొందరికి నొప్పులు రాకపోవడం మరో సమస్య. ఉమ్మనీరు పోవడం, కడుపులోని బిడ్డ ఉమ్మనీరు తాగడం, బిడ్డ అడ్డం తిరగడం, అలాగే బిడ్డ ఎక్కువ బరువు ఉండడంతో తప్పని స్థితిలో ఈ ఆపరేషన్ లు జరుగుతున్నాయి. గర్భం దాలిచినప్పటి నుంచి సరైన ఆహారం తీసుకోని, వ్యాయామం చేస్తూ,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తే గనుక మంచి ఫలితం ఉంటుంది.
Also Read: పంచెతో ప్రిన్సిపల్… జీతం కట్ చేసిన కలెక్టర్