టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుట్టునట్లు గతకొంతకాలంగా వదంతులు చక్కర్లుకొడుతున్నాయి. అయితే దీనిగురించి అటు సానియా కానీ,షోయబ్ కానీ స్పందించలేదు.
అయితే ఈ వదంతులకు చెక్ పెడుతూ సానియా, షోయబ్ కలిసి ఓ వెబ్ సిరీస్ ని జంటగా నిర్వహిస్తున్నామని ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దింతో అటు అభిమానులు… ఇటు మీడియా వాళ్ళు గందరగోళానికి గురైయ్యారు.
దాంతో వారి మధ్య అంతా బాగానే ఉందని నమ్మేలా చేసింది. ఈ ఆలోచనకు బలం చేకూర్చే స్వీట్ నోట్‌తో సానియాకు షోయాబ్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. అయితే కొన్ని నివేదికల ప్రకారం… సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య అంతా సరిగ్గా లేదు. అంతే కాకుండా వారిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయారు.
సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు వారి సన్నిహిత వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. కానీ జంటగా వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ కారణంగా తమ విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయడం మానుకుంటున్నారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటగా ది మీర్జా మాలిక్ షోతో సహా విభిన్న షోలు ఈవెంట్‌ల కోసం రెండు ఒప్పందాలపై సంతకం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వీరిద్దరూ అధికారికంగా విడిపోయే ముందు వారి వృత్తిపరమైన కమిట్మెంట్స్ ని నెరవేర్చాలి కాబట్టి ఈ షోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. షోయబ్, సానియా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణం ఇదే. ఈ ఒప్పందాలు ముగిసిన తరువాత వారి విడాకుల గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.