సమ్మర్ వస్తుంది అంటే చాలు చాలా మంది ఏసీ కావాలని కోరుకుంటారు. ఏసీ విషయంలో వైద్యులు ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే కొందరిలో మార్పు రాదు. అయితే బయట ఉన్న ఉష్ణోగ్రతలు కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అందుకే హీట్ తట్టుకోవడానికి మరో మార్గం లేక ఎసీలోనే ఉంటున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ వాడకం బాగా పెరిగింది అనే చెప్పాలి.
ఇక ఏసీ వాడకం విషయంలో మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏసీ రూమ్ లో కొన్ని కొన్ని ఉండటం మంచిది కాదు. ప్రధానంగా స్టీల్ వస్తువులు ఎక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువ కాలుతుంది. ప్రధానంగా ఏసీ ఉన్న రూమ్ లో బీరువా ఉండకూడదు అంటారు. బీరువా స్టీల్ తో తయారు చేస్తారు కాబట్టి,అది ఒక థర్మల్ కండక్టర్. అంటే త్వరగా చల్లబడిపోతుంది. ఏసీ నుంచి వచ్చే చల్ల గాలితో బీరువా ఎక్కువగా చల్లబడుతుంది.
దీనితో ఏసీ ఎక్కువ సేపు నడుస్తుంది కాబట్టి కరెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వేళ చెక్కతో చేసిన షెల్ఫ్ అయితే ఆ బాధ ఉండదు. చెక్క కాబట్టి చల్ల గాలి ని ఎక్కువగా గ్రహించే అవకాశం ఉండదు. దీనితో ఏసీ ఎక్కువ సేపు నడిచే అవసరం ఉండదు. ఏసి రూంలొ సాథ్యమైనంత వరకు వస్తువులు తక్కువగ ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. ఏసీ నుంచి వచ్చే చల్లటిగాలిని అవి తీసుకోవడం ఎక్కువ సమయం తీసుకుని మీకు ఇబ్బంది అవుతుంది.