మన దేశంలో దిష్టి భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దిష్టి భయానికి భారీగా ఖర్చు చేసి బయటపడుతూ ఉంటారు. లేదంటే తమకు ఏదొక నష్టం జరుగుతుంది అనే భయం ఉంటుంది. దీనికి సంబంధించి పూజలు చేసే వాళ్ళు, జంతు బలి ఇచ్చే వాళ్ళు, దేవాలయాల చుట్టూ తిరిగే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. ఇక ఇంటి ముందు వేప చెట్లు పెంచే వాళ్ళతో పాటుగా పటిక బెల్లం కట్టే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే.
అదే విధంగా నిమ్మకాయ, ఎండు మిర్చి, గుమ్మడి కాయలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇంటి ముందు బూడిద గుమ్మడి కాయ ఎందుకు కడతారు అనేది చాలా మందికి తెలియదు. గుమ్మడికాయ ల్లో,ఎంతో ప్రాణశక్తి ఉంటుందని కొందరు పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ ల్లో ఇది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అది ఇంటిముందు ఉంటే దాని మీద పడిన గాలి ఇల్లంతా వ్యాపిస్తే ఇంట్లో వారంతా క్షేమం అని బలమైన నమ్మకం.
పచ్చి బూడిద గుమ్మడి తురుము పెరుగులో వేసుకొని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎర్ర గుమ్మడి గింజలు తింటే ప్రాస్ట్రేట్ సమస్య కూడా తగ్గిపోతుంది. అదే విధంగా నిమ్మకాయలలో అలాగే కొబ్బరికాయల లో కూడా మంచి ప్రాణ శక్తి ఉంటుందని… ఆ కారణంతోనే వాటిని ఇంటిముందు కట్టుకుంటారట. మన సంస్కృతి లోని ఆచారాలలో ఆరోగ్యం ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. జంతుబలులకు ప్రత్యామ్నాంగా గుమ్మడికాయ, నిమ్మకాయలను ఎరుపురంగు తో కలిపి కోయడం వంటివి ఉన్నాయి.