ఈ రోజుల్లో స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ సందడి వేరేగా ఉంటుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తూ మీడియాలో భారీ హైప్ తీసుకొస్తారు అనే మాట వాస్తవం. చిన్న చిన్న సినిమాలకు హీరోల నుంచి ప్రతీ ఒక్కరు ఏదోక రూపంలో ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ మాత్రం తనది ఏ సినిమా విడుదలైనా సరే ప్రమోషన్ చేయరు.
తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఏవి చేసినా చిత్ర యూనిట్ చేయడమే గాని ఆయన స్వయంగా వెళ్లి చేసినవి ఏదీ ఉండదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే సినిమా చేసేసి హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అజిత్. ఇప్పుడు ఆయన నటించిన తనివు సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేస్తుంది. ఆయన హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.
మరో స్టార్ హీరో విజయ్ సినిమా వారసుడు విడుదల అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ ను విజయ్ భారీగా చేస్తున్నారు. కాని అజిత్ మాత్రం ప్రమోషన్ కు దూరం పాటిస్తున్నారు. కారణం ఏంటీ అంటే పదేళ్ళ క్రితం అజిత్ హీరోగా నటించిన ఒక సినిమా విడుదల అయింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అజిత్ పాల్గొనగా అక్కడ విజయ్ అభిమానులకు అజిత్ అభిమానులకు గొడవ జరిగి ఒక అభిమాని చనిపోయాడు. అందుకే అక్కడి నుంచి అజిత్ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళలేదు.