మనం వాడే దగ్గు మందులో ఆల్కాహాల్ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు కదూ. ఈ విషయం తెలియక టీం ఇండియా యువ క్రికెటర్ ఒకరు ఆరు నెలల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అసలు దగ్గు మందులో ఆల్కాహాల్ ఎందుకు వాడతారు…? సాధారణ దగ్గుకు వాడే మందులో యాంటీటస్సివ్, కార్మినేటివ్ గుణాల కోసం గానూ కర్పూరం సహా ఇతర సహజ మూలికలు వంటి వాటిని వాడుతూ ఉంటారు.
Also Read:ఎన్టీఆర్ కు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతారు…? రాజేంద్ర ప్రసాద్ కామెడి సినిమాలు చేయడానికి కారణం ఎవరూ…?
అయితే ఇక్కడ వాటి విషయంలో ఒక సమస్య ఉంది. ఇవి నీటిలో పూర్తిగా కరిగే అవకాశం ఉండదు. అందుకే ఆల్కాహాల్ సోల్యూబుల్ ఏజెంట్ గా వాడుతూ ఉంటారు. ఇక మరో కారణం ఏంటి అంటే… ఇక మరో కారణం మిస్కిబిలిటీ. అంటే ఒక ద్రావణo మరో ద్రావణంలో చక్కగా కలిసిపోయే గుణం అన్నమాట. ఆల్కాహాల్ హైడ్రో ఆక్సీ వర్గానికి చెందిన ద్రావణం కాబట్టి కరిగించుకునే గుణం పెరుగుతుంది.
మూడో కారణం… చక్కర (సుక్రోస్) వంటివి దగ్గు మందులో అధికంగా ఉంటాయి. ఆల్కాహాల్ ఉంటే చక్కర గడ్డ కట్టదు. చక్కర ఉంటే బూజు పట్టే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే ఆల్కాహాల్ కలుపుతారు. దగ్గు మందుని ఎక్కువ రోజులు నిలువ చేయడానికి మిగతా మూలికల మిశ్రమాలు కరగటానికీ గానూ… బూజు గట్రా పట్టకుండా ఉండడానికి వాడతారు. రోగికి చక్కటి నిద్ర పట్టించే గుణం( సెడేటివ్ నేచర్ ) కూడా ఆల్కాహాల్ కు ఎక్కువ.
Also Read:పెండింగ్.. పెండింగ్.. సుప్రీం కోర్టులో కేంద్ర, రాష్ట్రాల కేసులు ఎన్నంటే ?