మనం ఏ గోల్డ్ షాప్ లో చూసినా సరే బంగారు, వెండి ఆభరణాలను ఎప్పుడూ పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఉంచడం మీరు గమనించే ఉంటారు. అసలు ఆ విధంగా ఎందుకు చేస్తారో చూద్దాం. మాములుగా మనం కృష్ణుడి ఫోటోలు చూస్తే వెనుక ఆవులు తెల్లగానే ఉంటాయి. దానికి కారణం కృష్ణుడి రంగు నలుపు కాబట్టి. చిత్ర కారులు ఎప్పుడు కూడా నలుపుగా ఉండే ఆవుల్ని చిత్రించే అవకాశం ఉండదు.
Also Read:మరదళ్ల ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు వీరే !!
అలా చేస్తే కృష్ణుడి అందం సరిగా కనపడదు. ఇక ఆస్పత్రిలో ఆపరేషన్ సమయంలో అకుపచ్చ రంగునే వాడతారు. ఆ విధంగా కాకుండా ఎరుపు , నీలం వగైరా రంగులు వాడితే గనుక రోగి , వైద్యుల మానసిక స్థితులపై ఆ రంగుల ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు. రక్తం, మరకలు ఆకుపచ్చ మీద పడినా భయంకరంగా కనపడే అవకాశం ఉండదు. ఆకుపచ్చ అనేది లైట్ గా ఉంటుంది.
రోగిని భయపెట్టే విధంగా కూడా ఉండదు. ఆకుపచ్చను వ్యతిరేకించే వారు ఉండరు. ఆభరణాల విషయంలో కూడా అంతే. ఇతర రంగుల కాగితాలు ఆభరణాల కోసం వాడినా సరే పింక్ కలర్ లో ఉన్న మెరుపు ఇతర రంగుల్లో ఉండదు. ఆ రంగులో ఉంటే బంగారం ఆకర్షనీయంగా కనపడుతుంది. ఇతర రంగుల్లో బంగారం ఉంచితే బంగారం విలువ కోల్పోయినట్టుగా కూడా భావిస్తూ ఉంటారు.
Also Read:ఎన్నికలు ముగిశాయి… ద్రవ్యోల్బణం మొదలైంది