మనం గుండెపోటు విషయంలో ఎక్కువగా… పలానా పురుషుడికి గుండెపోటు వచ్చింది అని వింటూ ఉంటాం. మహిళలకు వచ్చే విషయానికి సంబంధించి వార్తలు అరుదుగా ఉంటాయి. అసలు మహిళలకు గుండెపోటు ఎందుకు తక్కువగా వస్తుంది…? ఒక మహిళ యొక్క గుండె సాధారణంగా చిన్నగా ఉంటుంది. గుండెలో కొన్ని అంతర్గత గదులు ఉంటాయి. వీటిలో కొన్నింటిని విభజించే గోడలు చాలా సన్నగా ఉంటాయి. స్త్రీ గుండె పురుషుడి గుండె కంటే కూడా చాలా వేగంగా పంప్ చేస్తుంది. అది ప్రతి స్క్వీజ్తో 10% తక్కువ రక్తాన్ని బయటకు పంపిస్తుంది.
ఇక మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. గుండెపోటు వచ్చినప్పుడు పురుషులు తమ ఛాతీ మీద ఏదో బరువు ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు ఐతే ఛాతీ నొప్పిని తీవ్రంగా వాళ్లకు గుండెపోటు చాలా భిన్నంగా ఉంటుంది. పురుషుల కంటే భిన్నమైన, సూక్ష్మమైన లక్షణాలను చెప్తూ ఉంటారు. గుండెపోటు అనేది పురుషుల కంటే స్త్రీకి చాలా కష్టంగా ఉంటుంది. గుండె పోటు తర్వాత పురుషులతో పోలిస్తే స్త్రీలు పని చేయలేరు. వాళ్ళు తరచుగా ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండే పరిస్థితి ఉంటుంది.
గుండెపోటుతో బాధపడుతున్న స్త్రీలకు మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటివి ఉండే అవకాశం ఉంటుంది. బాగా పెద్ద వాళ్ళు అయితే మాత్రమే వాళ్లకు గుండెపోటు వస్తుంది. మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయే వరకు ఈస్ట్రోజెన్ మహిళలకు గుండె జబ్బుల నుండి కొంత వరకు రక్షణ ఉంటుంది. అందుకే స్త్రీలలో గుండెపోటు వచ్చేవారి సగటు వయస్సు 70, పురుషులలో 66 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ మధ్య కాలంలో 25 ఏళ్ళ పురుషులకు కూడా గుండెపోటు వస్తుంది.