ఏదైనా సర్జరీ లేదా ఆపరేషన్ చేసిన సమయంలో కాస్త వైద్యులు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా పడుకోవాలి, ఏ విధంగా నడవాలి అనే విషయాలను పక్కగా చెప్తూ ఉంటారు. అసలు సర్జరీ చేసే రోజున రోగికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటీ అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత సిబ్బంది వచ్చి ముందు రోజు కూడా ఏం తినవద్దు అనే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు.
Also Read:పాడ్ కాస్ట్ అంటే ఏంటీ…? పాడ్ కాస్ట్ లు వచ్చి ఎన్నేళ్ళు అయిందో తెలుసా…?
అసలు ఎందుకు అనేది ఒకసారి చూస్తే… ఆపరేషన్ సమయంలో మత్తు ఇస్తారు కదా, దాని వలన వాంతులు అయి ఇబ్బంది కర పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ సమయంలో మత్తు మందు ఇస్తే ఆహారం పైకి వచ్చి ఊపిరితిత్తుల లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. మత్తు ప్రభావంతో జీవ క్రియలు మందగించి… ఊపిరితిత్తులలోని శ్వాస స్తంభించి ప్రాణాపాయం కూడా తలెత్తే అవకాశం ఉంది.
దీనిని యాస్పిరేషణ్ అని పిలుస్తారు వైద్య బాషలో. సర్జరీ టైమ్ లో అనుకోని కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులతో పాటుగా మోషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సర్జరీ తర్వాత ఏమీ తినకపోయినా నీరసం రాకుండా ఉండటానికి సెలైన్ ఎక్కిస్తారు. అదే మన శరీరానికి ఆహారంగా పని చేస్తుంది. ఇక కొన్ని వైద్య పరిక్షలకు సైతం ఏమీ తినకుండా వెళ్ళడమే మంచిది. పొట్ట లో ఆహారo ఉంటే జీర్ణ అవయవాల పరిశీలన అనేది సాధ్యం కాదు.
Advertisements
Also Read:ఫిక్సిడ్ డిపాజిట్ ముందే తీసుకుంటే బ్యాంకులు ఎందుకు చార్జీలు వేస్తాయి…?